Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

అడుగ‌డుగున అద్బుతాలు…మ‌హాబ‌లేశ్వ‌రం ఆల‌యాలు.!!

Advertisement

మహాబలిపురం.. తమిళనాడులోని చెన్నైకి దక్షిణాన సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పురాతనమైన పట్టణం. క్రీస్తు శకం 7 నుంచి 9వ శతాబ్దాల నడుమ దీన్ని పల్లవులు నిర్మించారు. అప్పట్లో ఈ పట్టణం చక్కని పర్యాటక ప్రదేశంగా ఉండేది. ఇక్కడి రాతి ఆలయాలు, వాటిపై ఉండే డిజైన్లు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

అప్పట్లో ఈ పట్టణాన్ని మహాబలి అనబడే ఓ రాక్షస రాజు పరిపాలించేవాడట. పేరుకు రాక్షస రాజే అయినా అతనిది చాలా జాలి గుండెనట. ఈ క్రమంలోనే అతని పేరిట ఈ పట్టణానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెబుతారు. దానికి అంతకుముందు మామళ్లపురం, కడల్‌మలై అనే పేర్లు కూడా ఉండేవట. కడల్‌మలై అంటే పర్వతాలు, సముద్రంతో కూడిన ప్రదేశం అని అర్థం.

ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

Advertisements

మహాబలిపురం మొత్తం 7 ఆలయాలు కలిపి ఒకే ఆలయంగా ఉండేవి. కానీ అందులో 2 ఆలయాలు సముద్రంలో మునిగిపోగా, ప్రస్తుతం 5 ఆలయాలు మాత్రమే బయటకు ఉన్నాయి. అవే మనకు కనిపిస్తాయి. అయితే సముద్రంలో మునిగిన ఆ ఆలయాల శిఖరాలను బోటులో వెళ్లి చూడవచ్చు. అందుకు గాను బీచ్‌ నుంచి బోటు సౌకర్యం అందుబాటులో ఉంది.

ప్రస్తుతం మనకు కనిపించే ఆ 5 ఆలయాలను దూరం నుంచి చూస్తే రథాలలా ఉంటాయి. అవి పాండవులకు చెందిన 5 రథాలే అని చెబుతారు.

ఈ ఆలయాలను నిర్మించేందుకు సుమారుగా 200 ఏళ్లు పట్టిందట. మొత్తం 3 తరాలకు చెందిన పల్లవ రాజులు ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారట.

ఆ 5 ఆలయాల్లో సముద్రానికి దగ్గర్లో ఉన్న ఆలయం ముఖ్యమైందిగా చెబుతారు. దీన్ని చాలా పకడ్బందీగా నిర్మించారు. ఆ నిర్మాణశైలిని మనం గమనించవచ్చు.

Advertisement

ఈ ఆలయ నిర్మాణాలు అన్నింటినీ కేవలం ఏక శిలతోనే నిర్మించారు.

మహాబలిపురంలో ప్రధాన ఆకర్షణ.. భారీ రాయి. ఇది కృష్ణుడు ఆడుకున్న రాయి అని చెబుతారు. ఇది గుండ్రంగా ఉంటుంది. బల్లపరుపుగా ఉన్న మరో రాయిపై బ్యాలెన్స్‌ అయి ఉంటుంది. కిందకు దొర్లినట్లు దూరం నుంచి చూస్తే అనిపిస్తుంది. కానీ అది ఎప్పటికీ దొర్లలేదు. అలాగే ఉంది. ఇది సైంటిస్టులకు ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే మారింది.

ఈ రాయి ఎత్తు 20 అడుగులు కాగా వెడల్పు 5 మీటర్లు. బరువు 250 టన్నుల వరకు ఉంటుంది. అయితే ఈ రాయిని అక్కడకు తీసుకువచ్చి పెట్టారా.. అదే సహజసిద్ధంగా అక్కడ ఏర్పడిందా.. అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ సుమారుగా 1200 ఏళ్ల నుంచి ఆ భారీ రాయి అక్కడ అలాగే ఉంది. ఇది నిజంగా విశేషమే.

ఈ రాయిని తమిళంలో వానిరై కల్‌ అని పిలుస్తారు. అంటే స్టోన్‌ ఆఫ్‌ ది స్కై గాడ్‌ అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఒల్లాంటయ్‌టంబో, పెరు, మచ్చు పిచ్చులలో ఉన్న భారీ ఏకశిలలకన్నా ఈ రాయి చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది.

సైన్స్‌ ప్రకారం చూస్తే.. ఈ తరహా రాయిని అలా బ్యాలెన్స్‌ చేసి ఉంచడం చాలా కష్టం. ఈ రాయి ప్రస్తుతం కేవలం 4 అడుగుల ప్రదేశంలో బ్యాలెన్స్‌ చేయబడి ఉంది. అది కూడా కొండ లాంటి ప్రదేశంలో. అంతటి భారీ రాయి అంత తక్కువ ప్రదేశంలో ఎలా బ్యాలెన్స్‌గా ఉందా అని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు. సాధారణంగా అలాంటి రాళ్లు కిందకు జారుతాయి. కానీ ఈ రాయి 1200 ఏళ్ల నుంచి అక్కడ అలాగే కదలకుండా ఉండడం.. నిజంగా ఆశ్చర్యమే మరి.

1908వ సంవత్సరంలో అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ ఆర్థర్‌ లాలీ ఆ రాయిని చుట్టు పక్కల నివాసితులకు ప్రమాదకరంగా ఉందని భావించి దాన్ని అక్కడి నుంచి తొలగించాలని అనుకున్నాడు. కానీ ఆ రాయి అస్సలు కదలలేదు. అది అందరినీ షాక్‌కు గురి చేసింది.

మహాబలిపురంలో బీచ్‌కు దగ్గర్లో ఉన్న ఆలయానికి 1984లో యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు లభించింది. ప్రతి ఏడాది డిసెంబర్‌, జనవరి సమయంలో ఇక్కడ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తారు. కథాకళి, భరతనాట్యం, కథక్‌, మోహినీ ఆట్టం, కూచిపూడి, ఒడిస్సీ తదితర భారతీయ నృత్యాలను కళాకారులు ప్రదర్శిస్తారు. ఈ ఫెస్టివల్‌ను తమిళనాడు ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహిస్తుంది.

ఆలయం వద్ద చెక్క బడిన నందుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఆలయానికి సమీపంలో చెక్కబడిన శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన వరాహ అవతార విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది.

Advertisements