Advertisement
సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తీసిన చిత్రం “మహానటి”.. ఈ తరం వారికి సావిత్రమ్మని,తన జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు.. అచ్చం మహానటే మన కళ్లముందు ఉందా అన్నట్టుగా సావిత్రిగా కీర్తి సురేష్ నటన ఎంత మెచ్చుకున్నా తక్కువే..అందం,అభినయం,విషాదాల కలయిక అయిన వెండితెర సామ్రాజ్ణి జీవితం నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు.
- చాలా సంతోషంలో ఉన్నప్పుడో, చాలా బాధలో ఉన్నప్పుడో ప్రేమలో పడకండి..ఇది మొదటి పాఠం..
- సావిత్రి నటనా జీవితం మొదలు పెట్టడం,సరికొత్త ప్రపంచాన్ని శివాజి గణేశన్ పరిచయం చేయడం..ఆ ఆనందంలో తనతోనే ప్రేమలో పడడం ఒకేసారి జరుగుతాయి.
- పిల్లలు ఉన్న వ్యక్తిని,భార్యాపిల్లలంటే ప్రేమ ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవద్దు..సావిత్రితో వివాహం నాటికే జెమినికి భార్యాపిల్లలున్నారు, ఆ పెళ్లంటే ఇష్టం లేకపోయినప్పటికి భార్యా పిల్లలంటే జెమినికి ఇష్టం ఉంది.
- ఒకవేళ మొదటి వివాహం బలవంతంగా జరిగిందనుకుందాం ,అతన్ని మీరు వివాహం చేసుకోవాలనుకుంటే పిల్లలున్నారా? లేదా చెక్ చేసుకోండి..పెళ్లంటే బలవంతంగా చేయగలరు..బట్ వాళ్లిద్దరి కలయిక అనేది వారిష్టప్రకారమే జరుగుతుంది కదా..! ఆలోచించండి..
Advertisements
- మన మూలంగా ఒక వ్యక్తి బాధపడుతుంటే , మనం సంతోషంగా బతకడం అసాధ్యం.. సావిత్రి మూలంగా జెమిని మొదటి భార్య బాధపడుతుంది..
Advertisement
- మన లైఫ్లో తీసుకునే మేజర్ స్టెప్ వివాహం.. అది కలకాలం సంతోషంగా నిలిచిపోవాలంటే సరైన పార్ట్నర్ ని ఎన్నుకోవాలి..
- పెళ్లైన మగాన్ని పెళ్లి చేసుకోవడం, తెగించడం కూడా మహిళా సాధికారతగా మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపిస్తే మోసపోకండి..మీకేం కావాలో మీకంటేఎవరికి ఎక్కువగా తెలియదు.
- డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..ఉచితంగా డబ్బులు పంచుతూ పోతే చులకన అవుతాం,మోసపోవడానికి మన దారులు మనమే వెతుక్కున్న వారిమవుతాం..
- సంతోషంలో ఉన్నప్పుడు , బాధలో ఉన్నప్పుడు మధ్యం అలవాటు చేసుకోకండి..ఇక ఏ చిన్న సమస్య ముందుకి వచ్చినా దాన్ని మర్చిపోవడానికి మందే పరిష్కారం అని బానిస అయ్యే ప్రమాదం ఉంది.
- డబ్బున్నవాళ్లందరూ చెడ్డవాళ్లూ కాదు, పేదవాళందరూ మంచోల్లు కాదు..దీనికి ఉదాహరణ సావిత్రి దగ్గర పనివాడే.
- చివరిగా చాలా ముఖ్యమైనది.. కర్మ ఫలితం..మనం ఏం ఇస్తే అదే తిరిగివస్తుంది..జెమిని లైఫ్లోకి ప్రవేశించి అతని మొదటి భార్య గురించి ఆలోచించని సావిత్రి, చివరకు అదే జెమిని మరో మహిళతో ఉండగా కళ్లారా చూసి గుండెపగిలేలా ఏడ్చి,చివరకు మద్యానికి బానిస అయి తన లైఫ్ ని తనే స్పాయిల్ చేస్కుంటుంది..
Advertisements