Advertisement
ఫోటో 1: మహేష్ బాబు…తన భార్య నమ్రతకు బట్టలుతడకంలో సహాయం చేస్తున్నట్టుంది కదా.!
ఫోటో 2 : నాగచైతన్య తన భార్య సమంతకు బట్టలుతకడంలో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా.!
Advertisements
కట్ చేస్తే…ఇవే ఫోటోలు మహేష్ బాబు, సమంత ల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో కనిపిస్తాయి.!
Advertisements
ప్రేమలు, భారాలు పంచుకోవడమే జీవితం. ఆ బాధ్యతలు తీసుకునేలా నన్ను ప్రోత్సాహించే నమ్రతకు థ్యాంక్స్ ! ఇది ఫోటోతో పాటు మహేష్ బాబు చేసిన పోస్ట్.!
Advertisement
క్లియర్ గా చెప్పాలంటే ఇదో మార్కెటింగ్ స్ట్రాటజీ …. ఈ రెండు ఫోటోల్లో ఏరియల్ వాషింగ్ సర్ఫ్ అండ్ వాషింగ్ లిక్విడ్ ప్రమోషన్ జరిగింది. సోషల్ మీడియాలో సెలెబ్రిటీలను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి… వారి ద్వారానే తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డాయి కంపెనీలు.! అందులో భాగమే ఈ ఫోటోలు.
- మహేష్ బాబుకు ఇన్ట్సాగ్రామ్ లో 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఫేస్ బుక్ లో …. 90 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
- సమంతకు అయితే ఇన్ట్సాగ్రామ్ లో దాదాపు కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు.! ఫేస్ బుక్ లో …. 90 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
పై ఫోటోను పోస్ట్ చేసినందుకు వీరిద్దరూ…. పారితోషికం కింద 5 లక్షలకు పైనే తీసుకున్నారని టాక్.!
నెటీజన్లు మాత్రం…సమంత విషయంలో…బయట ఘడీ డిటర్జెంట్ ను ప్రమోట్ చేస్తూ ఇంట్లో ఏరియల్ ను ప్రమోట్ చేస్తున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు!