Advertisement
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయి తొలి సినిమాతోనే నందిఅవార్డుని సొంతంచేసుకున్నాడు మహేష్ బాబు.! ఆ తర్వాత కౌబాయ్, సైంటిఫిక్ ఫిక్షన్, సోషియో పాంటసీ, మెసేజ్ ఓరియంటెడ్,కామెడి ఇలా మహేశ్ టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. అన్నింటికి మించి ఎంత హుందాగా ఉండాలో తెలిసిన వ్యక్తి! మహేశ్ బర్త్ డే సంధర్బంగా ఇప్పటివరకు వచ్చిన మహేశ్ ఢిఫరెంట్ జానర్ ఫిక్చర్స్ పై ఒక లుక్కేద్దామా..
మురారి : సోషియో ఫాంటసి
మహేశ్ నటించిన నాలుగో చిత్రం మురారి..ఉసురు తగలడం వల్ల ఒక వ్యక్తి వంశం ఎలా దెబ్బతిందనే కథాంశంతో రూపొందిన ఈ సినిమా మహేశ్ హిట్ మూవిల్లో ఒకటి.. ఒక జమీందారు 19వ శతాబ్దంలో చేసిన తప్పుకి ప్రతీ 48 ఏళ్ళకొకసారి అతని వంశస్తుల్లో ఒకరిని ఆ ఊరి దేవత బలితీసుకుంటుంది. ఈ సారి మరణించబోయే వ్యక్తి మరణం నుండి ఎలా తప్పించుకోగలిగాడు? అమ్మవారి శాపాన్ని ఎలా నివారించి తన వంశాన్ని కాపాడుకున్నాడన్నాడు అనే సోషియో ఫాంటసి చిత్రం..ఈ తరం ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చిన ఈ మూవి రెండు నంది అవార్డులను సొంతం చేసుకుంది. బాలివుడ్ భామ సొనాలిబింద్రే మహేశ్ సరసన నటించింది.
టక్కరి దొంగ : కౌబాయ్
Advertisements
కౌబాయ్ సినిమాలకు కేరాఫ్ గా కృష్ణగారిని పేర్కొంటారు..ఆ క్రెడిట్ ని టక్కరిదొంగ సినిమాతో మహేశ్ కూడా తన ఖాతాలో వేస్కున్నారు. మహేశ్ సరసన బాలివుడ్ భామలు బిపాషా, లిసారే నటించారు.
ఒక్కడు : స్పోర్ట్స్
క్రీడా , ప్రేమ ప్రధానాంశంగా వచ్చిన సినిమా ఒక్కడు..ఈ సినిమాలో మహేశ్ కబడ్డి ప్లేయర్ గా నటించాడు.. అప్పటివరకు కనీసం కబడ్డి ఆడని మహేశ్..ఈ సినిమా కోసం కబడ్డి నేర్చుకుని ప్రాక్టీస్ చేసి యాక్ట్ చేశాడు. భూమిక, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. భారీ సెట్టింగ్స్ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకోసం ఛార్మినార్ సెట్ వేయించారు..ఛార్మినార్ తో పాటు ఓల్డ్ సిటి మొత్తాన్ని అచ్చం దింపేశారు.
నిజం : డ్రామా, యాక్షన్
తండ్రిని చంపిన హంతకులను చంపడానికి సిద్దమైన తల్లికొడుకుల కథ నిజం.. అమాయకుడైన కొడుకులో తండ్రిని చంపిన వారిని చంపేందుకు కసిని నింపే తల్లి పాత్రలో ఆనాటి నటి తాళ్లూరి రామేశ్వరి నటించారు..
నాని : సైన్స్ ఫిక్షనల్
సైంటిఫిక్ ఫిక్షనల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేశ్ సరసనన అమీషా పటేల్ నటించింది. ఒకప్పటి సౌందర్య రాశి దేవయాని మహేశ్ కి తల్లిగా నటించింది.
అర్జున్ : సెంటిమెంటల్ మూవి
అన్నచెల్లెల్ల మధ్య ప్రేమని హృద్యంగా చూపించారు ఈ సినిమాలో.. మహేశ్ కి కవల సోదరిగా ఒకప్పటి హీరోయిన్ కీర్తి రెడ్డి నటించింది.. మునుపటి తరం హీరోయిన్ సరిత ఈ సినిమాలో విలనీ రోల్ పోషించింది..అత్తింటి వారి నుండి చెల్లెని రక్షించుకునే అన్నగా మహేశ్ పండించిన భావోద్వేగం కంటతడి పెట్టిస్తుంది.. ఈ సినిమాలో మహేశ్ కి జోడిగా శ్రేయ నటించింది.
పోకిరి : యాక్షన్ మూవీ
మహేశ్ లోని మరో యాంగిల్ ని చూపించిన మూవి పోకిరి..ఈ సినిమాలో ప్రతి పంచ్ డైలాగ్ సూపర్ హిట్టే.. మహేశ్ కెరీర్లో బ్లాక్ బాస్టర్ హిట్..ఈ సినిమాలో ఇలియానా మహేశ్ కి జోడిగా నటించింది .
Advertisement
ఖలేజా : కామెడి
మహేశ్ బాబులో కామెడి యాంగిల్ కూడా ఉంది అని నిరూపించిన సినిమా ఖలేజా.. ఈ సినిమా ధియేట్రికల్ హిట్ కాకపోయినా..ఎందుకు హిట్ కాలేదా అనేది అందరికి సందేహమే..ఈ సినిమాలో మహేశ్,ఆలి,అనుష్క, సునీల్ పండించిన కామెడి అంతా ఇంతా కాదు..నవ్వి నవ్వి పొట్టచెక్కలైపోతుంది..ఈ సినిమా తర్వాతే దూకుడు,ఆగడు, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్లో కామెడి పండించారు మహేశ్.
బిజినెస్ మాన్ : నెగటివ్ షేడ్స్
నెగటివ్ షేడ్స్ లో కూడా పాజిటివ్ గా కనిపించే పాత్రలో నటించిన సినిమా బిజినెస్ మాన్..పూరి, మహేశ్ కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ సినిమా.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : మల్టీ స్టారర్
టాలివుడ్లో మల్టీస్టారర్ మూవీస్ తక్కువే..అటువంటిది ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తే అభిమానులకు పండగే..వెంకటేష్ తో కలిసి మహేశ్ నటించిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. సూపర్ హిట్ మూవీ.
1 నేనొక్కడినే..! : సైకలాజికల్ మూవీ
తన అమ్మానాన్నలని చంపిన హంతకులను చంపే రాక్ స్టార్ కథ 1.. ఈ సినిమాలో మహేశ్ జ్ణాపక శక్తికి సంభందించిన అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు..చివరికి తన అమ్మానాన్నలను కలుసుకున్నాడా..వారిని చంపిన వారిని చంపాడా లేదా అనేది కథాంశం..ఇంట్రస్ట్ గా చూడకపోతే అస్సలు అర్దం కాదు.. మొదట్లో కొంచెం గజిబిజిగా ఉన్నా..తర్వాత చిక్కుముడులన్ని విడిపోతాయి..
శ్రీమంతుడు : మెసేజ్ ఓరియంటెడ్
ఊరు మనకు చాలా ఇచ్చింది తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతాం అనే కథాంశంతో వచ్చిన మూవీ..ఈ సినిమాతో ఊరిని దత్తత తీసుకోవడం అనే అంశం తెరపైకి వచ్చింది.. మహేశ్ కూడా వారి సొంత ఊరు బుర్రిపాలెంని దత్తత తీసుకుని అక్కడ సేవాకార్యక్రమాలు , స్కూల్ కట్టించడం లాంటివి చేశాడు.
భరత్ అనే నేను : పొలిటికల్
కొత్త విషయాలు తెలుసుకోవాలనే క్యూరియాసిటితో డిగ్రీల మీద డిగ్రీల పట్టాలు పొందుతున్న స్టూడెంట్.. ఒక రాష్ట్రానికి సిఎం అవుతాడు..తర్వాత జరిగే పరిణామాలే భరత్ అనే నేను.. మహేశ్ కెరీర్ తొలినాళ్లల్లోనే స్టూడెంట్స్ పాలిటిక్స్ లోకి రావాలనే కథాంశంతో సైనికుడు సినిమాలో నటించాడు.. కాని అది అంతంత మాత్రంగానే ఆడింది.. మహేశ్ ప్రయోగాలు చేసిన ప్రతి సారి హిట్ , ప్లాప్ ఖాతాల్లో పడినా ప్రేక్షకులకు మాత్రం సినిమాలు నచ్చేవి.
మహర్షి : రైతే రాజు.!
Advertisements
రైతే రాజు..రైతు దేశానికి వెన్నెముక లాంటి గొప్పగొప్ప డైలాగులు చెప్తుంటాం..అటువంటి రైతుగురించి ,రైతు సమస్యల గురించి మహర్షి సినిమా ద్వారా చూపించాడు మహేశ్… ఈ సినిమా తర్వాత చాలా మంది వీకెండ్ ఫార్మింగ్ వైపు అట్రాక్ట్ అయ్యారు..!
చివరిగా మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మహేశ్ నటించిన సినిమాలు ఎక్కువ శాతం ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి..కానీ మహేశ్ ఒక్క రీమేక్లో కూడా నటించలేదు..!