Advertisement
శివ తర్వాత తెలుగు ఇండస్ట్రీ టేకింగ్ ను సెట్ చేసిన సినిమా పోకిరి…మహేష్ బాబు ని సూపర్ స్టార్ ని చేసి తెలుగు సినిమా రిశ్రమలో ఒక ట్రెండ్ ని సృష్టించి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని కలెక్షన్స్ వసూలు చేసి కొత్త సంచలనం సృష్టించింది ఈ సినిమా!
ఉత్తమ్ సింగ్ S/o సూర్యనారాయణ….పోకిరి గా ఎలా మారింది?
పూరీ జగన్నాథ్ ఈ స్టోరీ ని తన మొదటి సినిమా బద్రి టైం లోనే రాసుకున్నాడు. అప్పుడే పవన్ కళ్యాణ్ కి వినిపిస్తే నచ్చలేదు అని చెప్పాడట, తర్వాత 2005 లో రవితేజ తో చేద్దాం అని ప్లాన్ చేసుకున్నాడు . రవితేజ బిజి షెడ్యూల్ లో ఉండటంవల్ల గ్యాప్ వచ్చింది , అంతవరకు ఆగలేని పూరి మహేష్ బాబు కి ఈ కథ చెప్పాడు . మహేష్ కథ విని ఒకే చెప్పేసాడు కానీ పూరి పెట్టిన టైటిల్ ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ మార్చమని మహేష్ సలహా ఇచ్చారు. పూరి పండు , పోకిరి అనే పేర్లను సజెస్ట్ చేసాడు. మహేష్ పోకిరి అనే టైటిల్ ను ఫైనల్ చేసాడు .
మహేష్ రెమ్యునరేషన్ కాకుండానే ఈ సినిమా బడ్జెట్ 9 కోట్లు…. 60 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తిచేశారు . 2006 ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాపై మొదట పెద్దగా అంచనాలు లేవు ….. కానీ రిలీజ్ అయ్యాక సినిమా చూస్తూ జనాలు నోరెళ్ళబెట్టారు . ఆ డైలాగ్స్ , ఆ యాక్షన్ సీన్స్ కి ముఖ్యంగా క్లైమాక్స్ కి అందరూ బిత్తర పోయారు . ఎక్కడ చూసినా పోకిరి గురించే చర్చలు. ఇందులో మహేష్ బాబు మ్యానరిజం , బాడీ లాంగ్వేజ్ అల్టిమేట్. ఇక పాటలు, ఫైట్స్ మరొక ఎసెట్ . మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది.
Advertisement
పూరి జగన్నాథ్ డైలాగ్స్ కుమ్మేశాడు. డైలాగ్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా లేనట్టుగా కొత్తగా ఉంటాయి . ముమైత్ ఖాన్ చేసిన ఇప్పటికింకా నా వయసు పాటైతే యూత్ ని మళ్లీమళ్లీ సినిమాకి వచ్చేలా చేసింది . గలగల పారుతున్న అంటూ కృష్ణ పాటను రిమేక్ చేసి ఈ సినిమాలో పెట్టుకున్నారు.
Advertisements
పోకిరి రికార్డ్స్
- టాలీవుడ్ లో ఫస్ట్ టైం 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి సినిమా…. అంతకుముందు కనీసం 25 కోట్లు కూడా వసూలు చేసిన సినిమాలు లేవు .
- 300 సెంటర్లలో 50 రోజులు , 200 సెంటర్స్ లో 100 రోజులు , 63 సెంటర్ లలో 175 రోజులు ఆడి అల్ టైం రికార్డ్స్ సృష్టించింది .
- హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో 1కోటి 70 లక్షల గ్రాస్ వసూల్ చేసి టాలీవుడ్ నివ్వెర పోయేలా చేసింది .
- అతడుతో బెస్ట్ యాక్టర్ అనిపించుకొన్న మహేష్ పోకిరితో సూపర్ స్టార్ అయిపోయాడు.
- తెలుగులోనే కాదు తమిళ్ , కన్నడ , హిందీ , బెంగాల్ భాషల్లోకి రీమేక్ అయ్యి అక్కడ కూడా బంపర్ హిట్ అయ్యింది మన పూరీ పోకిరి!
Advertisements