Advertisement
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నది మాత్రం మహేష్ మెడ మీద రూపాయి నాణం టాటూ.! ఈ టాటూ మహేస్ కు ఓ డిఫరెంట్ లుక్ ను ఇచ్చింది.
సినిమా గురించి కాస్త పక్కకు పెట్టి..ఆ రూపాయి నాణం గురించి మాట్లాడుకుందాం:
దేశ స్వాతంత్ర్యం తర్వాత ఇండియా 1950 లో మొదటి రూపాయి నాణాన్ని ముద్రించింది. అప్పుడు రూపాయికి 64 పైసలు అంటే 16 అణాలు ! 1957 లో దశాంశమాన పద్దతిని తీసుకువచ్చి 1 రూపాయికి 100 పైసలుగా నిర్ణయించారు.
Advertisement
రూపాయి నాణెంపై రెండు గోధుమ కంకులు:
ఈ గోధుమ కంకులు… భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశంగా తెలియజేస్తున్నాయి. అప్పుడు మనదేశ ప్రధాన ఆధాయ వనరు కూడా వ్యవసాయమే కాబట్టి ..దానికి సింబాలిక్ గా చూపించడం కోసం నాణాలపై గోధుమ కంకులను ముద్రించారు.
Advertisements
ఉత్తర భారతదేశంలో 1889 తర్వాత 1950 కాలంలో గోధుమ పంట విపరీతంగా పండింది. 1965 తీసుకొచ్చిన హరితవిప్లవం కారణంగా గోధుమ పంట రెట్టింపైంది. అందుకే తర్వాత తీసుకొచ్చిన కాయిన్స్ పై ఆ సింబల్ అలాగే కంటిన్యూ చేశారు. అదన్నమాట రూపాయి కథ.! మీ ద్వారా మరోసారి రూపాయి చరిత్ర గురించి గుర్తుచేసుకున్నాం..సో ఆల్ ది బెస్ట్ మహేష్ బాబు గారు.
Advertisements