Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

మహేష్ బాబు వదులుకున్న 13 సూపర్ హిట్ సినిమాలు ఇవే.! ఇవి కూడా చేసుంటే..?

Advertisement

సూపర్ స్టార్  మహేష్ బాబు  ఇప్పటికే  26 సినిమాల్లో హీరోగా  చేసాడు. ప్ర‌స్తుతం త‌న‌  27 వ సినిమాకు సంబంధించిన  ప్రీ ప్రొడక్షన్ వర్క్  జరుగుతుంది. ఈ 26 సినిమాల్లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్లు, ఇంకొన్ని అట్ట‌ర్ ప్లాఫ్ లు కూడా ఉన్నాయి.! అయితే మ‌హేష్ త‌నవ‌ర‌కు వ‌చ్చిన 13 సినిమాలను వ‌దులుకున్నాడు….అలా మ‌హేష్ వ‌దులుకున్న సినిమాలు త‌ర్వాత సూప‌ర్ హిట్లుగా మారాయి.! ఇంత‌కీ మ‌హేష్ వ‌దులుకున్న ఆ 13 సినిమాలేంటో చూద్దాం!

1. యమలీల

డైరెక్టర్  ఎస్వి కృష్ణారెడ్డి  యమలీల  సినిమా స్టోరిని కృష్ణ‌కు వినిపించిన‌ప్పుడు … ఇంప్రెస్ అయిన కృష్ణ ఈ సినిమాతో మ‌హేష్ ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌నుకున్నాడు..కానీ మ‌హేష్ చ‌దువును డిస్ట‌ర్బ్ చేయ‌కూడ‌ద‌ని….త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు. దీంతో ఆ సినిమా అలీ చేతిలో ప‌డింది. సూప‌ర్ హిట్ అయ్యింది!

yama leela

2. నువ్వే కావాలి

Advertisements

స్రవంతి రవి కిషోర్  అప్పుడే  ఇండస్ట్రీలోకి  ఎంటర్ అయిన  మహేష్ ని  నువ్వే కావాలి  సినిమాకి  హీరోగా అడిగి ,  ఆ సినిమా  ఒరిజినల్  వర్ష‌న్  సీడీ ని పంపాడు . త‌ర్వాత మ‌హేష్ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాక‌పోవ‌డంతో త‌రుణ్ హీరోగా చేశాడు.

3. ఇడియట్

ఈ సినిమా  కోసం  పూరి జగన్నాథ్  రవితేజ  కంటే ముందే  నలుగురు  హీరోలను  కాంటాక్ట్  అయ్యాడు . వారిలో  మహేష్  ఒకరు ,  అయితే  అలాంటి  కథలో  ఆడియన్స్  త‌న‌ను యాక్సెప్ట్  చేయలేరని ఆ సినిమాను రిజెక్ట్  చేసాడు మహేష్  .

idiot

4. మనసంతా నువ్వే

ఎమ్ ఎస్ రాజు  మనసంతా  నువ్వే  కథకి  మహేష్ హీరో  అయితే  బాగుంటుందని  మ‌హేష్ ను సంప్ర‌దిస్తే…ప్ర‌స్తుతం డేట్స్ లేవ‌ని…కుదిరిన‌ప్పుడు వేరే సినిమా చేద్దామ‌న్నాడు.. ఉద‌య్ కిర‌ణ్ ఫేట్ ను మార్చిన సినిమా ఇది!


5. గజిని

తెలుగులో  , తమిళ్ లో  దాదాపు  7 గురు  హీరోల చుట్టూ  తిరిగిన  కథ  గజిని! మహేష్ ని  అడిగితే నేను  ఆ క్యారెక్టర్  చేయలేను  స్వారీ  అని చెప్పాడ‌ట‌!

Advertisement

6. లీడర్

ఈ సినిమా క‌థ‌ను మ‌హేష్ కు వినిపించిన‌ప్పుడు..క‌థ ప‌రంగా ఒకే కానీ ఇంకొన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ యాడ్ చేయ‌మ‌ని స‌లహా ఇచ్చాడ‌ట‌… దానికి ఒప్పుకోని శేఖ‌ర్ క‌మ్ముల రానాతో ఈ సినిమా చేశాడు.

7. ఏమాయ చేసావే

మహేష్ బాబు  కోసం  గౌతమ్  మీనన్  తయారు చేసిన  కథ ఏమాయ‌చేశావే!   మంజుల  ప్రొడ్యూస్  చేయాలనుకుంది . కానీ  మహేష్  ఖలేజా  షూటింగ్ లో  బిజీ గా  ఉండడంతో  స్టొరీ  కూడా వినకుండానే  రిజెక్ట్ చేసాడట‌! .

 

8. రుద్రమదేవి

రుద్రమదేవి  సినిమాలో  గోన గన్నారెడ్డి  క్యారెక్టర్ మొదటి  నుంచి  మహేష్ బాబు  చేయాలనుకున్నారట‌…  ఏవో కార‌ణాల రీత్యా మహేష్ నుండి ఈ క్యారెక్ట‌ర్ చేజారింద‌ట‌!


9. 24

ఫస్ట్ టైమ్  డ్యూయల్  రోల్  చేసే  కథ  మహేష్ కి దక్కింది .  మెయిన్  క్యారెక్టర్ లో మార్పులు  చేయమని  మహేష్  చెప్పడంతో ….. అది న‌చ్చ‌ని డైరెక్ట‌ర్ విక్రమ్ కుమార్ ఈ సినిమాను సూర్య‌తో చేశాడు.

10. అఆ

త్రివిక్రమ్  శ్రీనివాస్  మహేష్ తో  చేయాలని  రాసుకున్న స్టోరీ  అఆ . స్టోరీ  మహేష్ కి  నచ్చింది  కానీ  డేట్స్  కుద‌ర‌క ఈ మూవీని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. నితిన్ కెరీర్ కు ఓ హిట్ యాడ్ అయ్యింది!

11. ఫిదా

ఎప్పటినుంచో  మహేష్ తో  సినిమా  చేయాలని  ట్రై చేస్తూ  ఫిదా  కథని  కూడా  మహేష్ కి  వినిపించి ,మళ్ళీ  నిరాశకే  గురయ్యాడు  శేఖర్ కమ్ముల .  డేట్స్ అడ్జెస్ట్  అవ్వడం  లేదని  ఈ సినిమాని  రిజెక్ట్  చేసాడు మహేష్ బాబు .

12 . గ్యాంగ్ లీడర్

నాని  గ్యాంగ్ లీడర్  కథ  డైరెక్టర్  విక్రమ్ కుమార్ ముందుగా  మహేష్ కి  చెప్పాడు . దీన్ని మ‌హేష్   సున్నితంగా తిరస్కరించాడు.

13. పుష్ప

మహేష్ ని  డిఫ్రెంట్ గా  చూపించాలని  సంవత్సరం పాటు  కష్టపడి ,  సుకుమార్  తయారు  చేసిన  కథ పుష్ప .  హీరో  గెటప్  అండ్  బాడీ లాంగ్వేజ్  తనకి సెట్  అవ్వవని ,  క్యారెక్టర్ లో  చేంజెస్  చేస్తే  మూవీ చేద్దాం  అనడంలో .  అదికూడా  క్యాన్సల్  అయ్యింది .

Advertisements

రీసెంట్ గా  వంశీ పైడిపల్లి ,  సురేందర్ రెడ్డి ల కథలని  కూడా  మ‌హేస్ రిజెక్ట్  చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్ ! తాము న‌టించాల‌నుకునే సినిమాల‌పై హీరోల‌కు ఓ విజ‌న్ ఉంటుంది! ఆ సినిమాలో త‌మ ఇమేజ్.. ఆడియ‌న్స్ తాలూకూ ఎక్స్ పెక్టెష‌న్స్ , మార్కెట్ వాల్యూను దృష్టిలో పెట్టుకొనే నిర్ణ‌యాలు తీసుకుంటారు.