Advertisement
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 470 మంది అమ్మాయిలను దత్తత తీసుకున్నాడు ఆ వ్యక్తి..వారందరికి దగ్గరుండి పెళ్లిల్లు జరిపించాడు..ఈ లెక్క ఇంకా పెరుగుతూనే ఉండొచ్చు.. అసలు ఎవరా వ్యక్తి.. ఎందుకు ఈ పెళ్లిల్లు జరిపిస్తున్నాడు. దానివెనుక ఉన్న కథ ఏంటి..
అతడి పేరు మహేశ్ సవాని…గుజరాత్ లోని భావనగర్ కి చెందిన వజ్రాల వ్యాపారి.. రిటైల్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్లు కూడా ఉన్నాయి.. అవన్ని ఒకవైపు.. మరో యాంగిల్లో చూస్తే అతనొక మానవతావాది.. తను సంపాదించే ప్రతి పైసా పేదవారికి సాయం చేయడానికి ఉపయోగించాలనుకుంటాడు..కేవలం పెళ్లిల్లు మాత్రమే కాదు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు..
మహేశ్ సవాని సోదరుడు తన పిల్లలు యుక్తవయసులో ఉండగానే చనిపోయాడు..ఆ పిల్లలకు తండ్రిలేని లోటు తెలియకుండా వారి బాగోగులన్ని మహేశ్ దగ్గరుండి చూసుకున్నారు..వారి పెళ్లిల్లు చేశాడు..మొదటి సారి మహేశ్ సవానికి ఆడపిల్లల పెళ్లి చేయడం ఎంత కష్టమో అనిపించింది..తర్వాత 2008లో సరిగ్గా పదిరోజుల్లో కూతురి పెళ్లి ఉందనగా తన దగ్గర పనిచేసే ఉద్యోగి ఒకరు చనిపోయారు..అప్పుడు ఆలోచనలో పడ్డారు మహేశ్ సవాని..
Advertisement
తండ్రి లేకుండా ఆడపిల్ల పెళ్లి చేయడం చాలా కష్టతరం అని..అప్పటి నుండి తన గ్రామంలోని తండ్రిలేని పేద ఆడపిల్లల్ని తాను దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించాడు..కులమతం తేడా లేకుండా తండ్రిలేని పిల్లలను దత్తత తీసుకున్నాడు..వారిలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లింలు ఉన్నారు..ఎవరి ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా వారి వారి పెళ్లిల్లు జరిపించాడు. వారి పెళ్లికి అయ్యే ఖర్చు పూర్తిగా తనదే అని భరోసా ఇచ్చాడు మొదట 2014లో 111 మంది అమ్మాయిల వివాహం అంగరంగవైభవంగా జరిపించాడు.. ఒక్కో ఆడపిల్ల పెళ్లి ఖర్చు 4లక్షల రూపాయలు..
Advertisements
వారికి బంగారు ఆభరణాలు, పెళ్లి తర్వాత ఒక ఇంటికి కావలసిన సామాన్లు అన్నింటిని తానొక్కడే సమకూర్చాడు.. ఇప్పటి వరకు 470వరకు ఆడపిల్లల వివాహాలు జరిపించాడు.. ఎటువంటి డొనేషన్స్ ని ఆశించకుండా ఇంత ఖర్చుకి తన సంపాదనలోని ప్రతి పైసాని వాడాడు. నువ్వు చేసే మంచి పనిలో మమ్మల్ని భాగం కానివ్వమని ఎవరైనా కోరినా కూతురి బాధ్యత తండ్రిదే కదా అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు..
Advertisements