Advertisement
ఆదివారం అర్థరాత్రి దాటిపోయింది. ఆర్మీలో మేజర్ గా ఉన్న కేతన్ శర్మ తన ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో ” ఏమో…? ఇదే నా చివరి ఫోటో అవ్వొచ్చు! ” అని మెసేజ్ చేశాడు.! ఉదయం ఈ మెసేజ్ ను చూసిన భార్య కంగారుగా అతనికి ఫోన్ కలిపింది. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది… కాసేపటికి…. ఆర్మీ ఆఫీసర్ లు వచ్చి మీ భర్త చనిపోయాడని చెప్పారు. ఆమె గుండలవిసేలా రోధించింది.
Advertisement
ఓ ఆపరేషన్ నిమిత్తం వెళ్తూనే…కేతన్ ఈ మెసేజ్ చేశాడు. కాశ్మీర్ లోని అనంతనాగ్ అచాబల్ ఏరియాలో దాగున్న మిలిటెంట్స్ ను పట్టుకునేందుకు తన ట్రూప్ తో వెళ్లాడు కేతన్…వీరిని పసిగట్టిన మిలిటెంట్స్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు… ఎన్ కౌంటర్ మొదలైంది ..ఆ ఎన్ కౌంటర్ లో కేతన్ శరీరంలోకి బుల్లెట్స్ దూసుకెళ్లాయి..కేతన్ అమరుడయ్యాడు.
Advertisements
భర్త మృతదేహాన్ని చూసి భార్య తల్లడిల్లింది. మూడేళ్ల కేతన్ కూతురు…అమరుడైన తండ్రిని చూసి జైహింద్ అంటూ నినాదాలు చేసింది….తండ్రి మళ్లీ తిరిగిరాడనే విషయం తెలియని చిన్న వయస్సు తనది. ఈ ఘటన జులై 18, 2019 న జరిగింది.!
Advertisements