Advertisement
ఎవరైనా సరే.. కూర్చున్న చెట్టు కొమ్మనే నరికివేయరు. అలా చేస్తే వారిని మూర్ఖులు అని అయినా అంటారు. లేదా పిచ్చి వారని కూడా అంటారు. అయితే ఇలా చేసే వారిని నిజంగా మనం ఇప్పటి వరకు దాదాపుగా చూడలేదు. కానీ తాజాగా ఇలా ఓ వ్యక్తి చేశాడు. తాను కూర్చున్న తాటి చెట్టు కొమ్మలనే కట్ చేశాడు. ఓ చెయిన్‌సా సహాయంతో అతను తాటి చెట్టు పైభాగానికి చేరుకుని దాని కొమ్మలను కట్ చేశాడు.
అలా ఆ వ్యక్తి ముందుగా చెయిన్‌సా సహాయంతో తాటి చెట్టు పైభాగంలో ఉన్న కొమ్మలను కట్ చేయగా.. అది ఒక్కసారిగా అటు ఇటు ఊగింది. దీంతో అతను కింద పడతాడేమోనని చుట్టూ ఉన్న వారు భావించారు. కానీ అలా జరగలేదు. ఆ వ్యక్తి కుదురుగా చెట్టుపై గట్టిగా పట్టుకుని కూర్చునే ఉన్నాడు. దీంతో అతను చెట్టు ఊగినప్పటికీ కింద పడలేదు. ఆ సమయంలో ఆ వీడియోను చిత్రీకరించి దాన్ని ట్విట్టర్ పోస్ట్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Advertisement
Ever seen anyone cut a really tall palm tree?
Oh my god… pic.twitter.com/O0sde0ZCz0
Advertisements
— Rex Chapman?? (@RexChapman) September 25, 2020
Advertisements
34 సెకన్లు నిడివి ఉన్న ఆ వీడియోకు ఇప్పటికే 66 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 20వేల మంది ఆ వీడియోను రీట్వీట్ చేశారు. ఎన్నో వందల మంది కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఆ వీడియోలోని వ్యక్తి చెట్టు మీద నుంచి కింద పడతాడని మీరు అనుకుంటే చేతులు పైకెత్తండి.. అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. మరొక యూజర్.. ఆ వీడియోలోని వ్యక్తి చెయిన్‌సాను ఇంకా పట్టుకునే ఉన్నాడు.. అని కామెంట్ చేశాడు. ఇక ఇంకో యూజర్.. ఆ తాటి చెట్టును కింది వైపుకు కట్ చేయవచ్చు కదా.. అని అడగ్గా.. అందుకు మరొక యూజర్ స్పందిస్తూ.. లాస్ ఏంజలస్‌లో ఎక్కడ చూసినా తాటి చెట్లే ఉన్నాయి, వాటి చుట్టూ కరెంట్ తీగలు ఉన్నాయి, తాటి చెట్లను కింది వైపుకు కట్ చేస్తే అవి కరెంటు తీగలపై పడతాయి, అందుకనే వాటిని పైభాగంలో కట్ చేస్తున్నారు.. అని కామెంట్ పెట్టారు.