Advertisement
ఎన్ని హోటళ్లు అందుబాటులో ఉన్నా.. ఏ రెస్టారెంట్‌లో ఎలాంటి ఫుడ్ లభించినా.. ఇంటి భోజనం.. ఇంటి భోజనమే.. ఇంట్లో చేసుకుని తినే పచ్చడి వంటకం అయినా సరే కమ్మగా ఉంటుంది. అయితే సాధారణంగా బయట తిరిగే వారు, ఉద్యోగాలు చేసేవారు లంచ్ బాక్స్ తెచ్చుకోకపోతే.. ఏదైనా ఒక రెస్టారెంట్‌లోనో, ఫుడ్ స్టోర్‌లోనో బయటి భోజనం తింటారు. కానీ వారికి ఇంటి భోజనం తినాలని ఉంటుంది. అదేమో బయట లభించదు. అయితే సరిగ్గా ఇదే సమస్యపై దృష్టి పెట్టి వారు ఇంటి భోజనాన్ని ఫుడ్ స్టోర్‌లో అందిస్తున్నారు. దీంతో వారు సక్సెస్ బాట పట్టారు.
మైసూరు కేంద్రంగా ఫుడ్ బాక్స్ అనే ఫుడ్ స్టోర్ ఉంది. దీన్ని 2015 డిసెంబర్ 3లోనే ప్రారంభించారు. కాకపోతే అప్పట్లో స్టోర్ లేదు. ఇంట్లోనే వారు ఫుడ్‌ను తయారు చేసి డెలివరీ చేసేవారు. ఇక 2019 మార్చిలో మైసూర్‌లో ఫుడ్ బాక్స్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే దీన్ని సక్సెస్ బాట పట్టించింది ఓ యువకుడు. అవును.. రూ. లక్షలు జీతం వచ్చే జాబ్‌ను వదులుకుని మరీ మైసూరు నగరంలో జనాలకు కమ్మని ఇంటి భోజనం పెడుతున్నాడు. అందుకనే ఫుడ్ బాక్స్‌కు విపరీతమైన ఆదరణ ఏర్పడింది.
ఫుడ్ బాక్స్ కంపెనీని మైసూరుకు చెందిన మురళి గుండన్న అనే యువకుడు ప్రారంభించాడు. అతను 2014లో డిగ్రీ పట్టా పొందాడు. జేఎస్‌డబ్ల్యూలో మంచి జాబ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా రూ. లక్షల్లో జీతం వచ్చేది. కానీ సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని భావించి అతను జాబ్‌కు రిజైన్ చేశాడు. ఫుడ్ బాక్స్ పేరిట ఇంటి భోజనాన్ని అందించే వ్యాపారం ప్రారంభించాడు. దాన్ని మొదట్లో తన ఇంటి పక్కనే ఓ గ్యారేజ్‌లో ఏర్పాడు చేశాడు. తరువాత ఏకంగా ఓ ఔట్‌లెట్‌నే ప్రారంభించాడు. ఇక ఈ సక్సెస్‌కు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన సహకారమే కారణమని అతను తెలిపాడు.
Advertisements
Advertisement
ఇక ఫుడ్ బాక్స్ ద్వారా మైసూరు వాసులకు పొంగల్, కేసరి బాత్, పులిహోర, ఖీర్, ఇడ్లీ వంటి కమ్మని హోం ఫుడ్స్‌ను బాక్స్‌లలో డెలివరీ చేస్తున్నారు. మొదట్లో రోజుకు అలాంటి ఫుడ్ బాక్స్‌లు 15 నుంచి 20 వరకు అమ్ముడయ్యేవి. కానీ తరువాత వారానికి 2వేల ఫుడ్ బాక్స్‌లను విక్రయించడం మొదలు పెట్టారు. అలా అలా ఆ కంపెనీ ఎదిగింది. ఇక ప్రస్తుతం అందులో 27 మంది సిబ్బంది, చెఫ్‌లు పనిచేస్తుంది. మైసూరు వ్యాప్తంగా 30వేల మందికి నిత్యం ఫుడ్ బాక్స్‌లను వారు సప్లై చేస్తున్నారు.
Advertisements
బయట ఒక పిజ్జా ఆర్డర్ చేస్తే కనీసం రూ.400 అవుతుంది. కానీ మా మీల్స్ కేవలం రూ.80 కే లభిస్తుంది.. అని ఫుడ్ బాక్స్ ఓనర్ మురళి తెలిపాడు. తాము సక్సెస్‌లోకి వచ్చేందుకు తాము అందించే నాణ్యమైన ఆహారం కారణమని, కస్టమర్ ఆర్డర్ చేశాక డెలివరీ సమయానికి ఫుడ్‌ను వేడిగా ఉంచుతామని, దాంతోపాటు రుచి, నాణ్యత ఏమాత్రం తగ్గకుండా ఫుడ్‌ను డెలివరీ చేస్తామని అందుకనే తాము సక్సెస్ సాధించామని అతను తెలియజేశాడు. ఇక ఈ ఫుడ్ బాక్స్ ద్వారా ఏడాదికి రూ.1.50 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అతను తెలిపాడు. అవును మరి.. మనదంటూ ఏదైనా ప్రత్యేకతతో బిజినెస్ చేస్తూ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందిస్తే ఏ వ్యాపారం అయినా కచ్చితంగా వృద్ధిలోకి వస్తుంది. అతనూ అదే చేసి నిరూపించాడు.