Advertisement
ఎంత బ్యాట్ మాన్ డ్రెస్ వేసుకుంటే మాత్రం గబ్బిలంలా తలకిందులుగా వేలాడాలా చోద్యం కాకపోతే… మనిషి అయితే చోద్యం అనుకోవచ్చు..కానీ అది నిజంగానే గబ్బిలం..మనిషి అంత ఎత్తున్న గబ్బిలం.. తలకిందులుగా వేలాడుతున్న అతిపెద్ద గబ్బిలం ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..నిజంగా గబ్బిలమేనా? గబ్బిలాలు అంత పెద్దగా ఉంటాయా ??
అలెక్స్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో మనిషి సైజున్నంత గబ్బిలాన్ని చూశానంటూ ట్వీట్ చేశాడు… ఫిలిప్పీన్స్ లో మనిషి సైజున్నంత గబ్బిలాలు ఉన్నాయని.. వాటి గురించే తాను ఈ రోజు మాట్లాడుతూ ఉన్నానంటూ ఫోటోలు శేర్ చేశాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో గబ్బిలాలు అనేవి పెద్ద హాట్ టాపిక్ గా మారాయి..ఇప్పుడు మనిషంత ఎత్తున్న గబ్బిలం ఫోటో చూసే సరికి అందరూ ఆశ్చర్యపోయి.. ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో లైకులు,శేర్లు చేశారు.
Advertisement
ఇక అలెక్స్ శేర్ చేసిన ఫొటోపై అనేక మంది నెటిజన్స్ కామెంట్ చేశారు.వారిలో ఫిలిఫ్పిన్స్ వారు కూడా ఉన్నారు.. “ఇవి అతిపెద్ద గబ్బిలాలే కాని ,మనిషంత పెద్దగా ఉండవు.. కుక్కపిల్ల సైజులో ఉంటాయి..వీటి రెక్కలు చాలా పెద్దగా ఉండి..అవి చాలా ఎత్తుగా ఉన్నట్టు కనిపిస్తాయి..ఇవి ఫిలిప్పిన్స్ లో ఉన్న మాట నిజమే కాని , ఐదు సంవత్సరాల క్రితం మాత్రమే నేను వీటిని చూసాను..ఈ మధ్య కాలంలో వీటిని చూడలేదు అంటూ ఒక ఫిలిఫ్పియన్ కామెంట్ చేసారు..
నిజంగా ఈ గబ్బిలాలు ఇప్పుడున్నాయా అని సెర్చ్ చేయగా తేలిన అసలు సంగతి ఏంటంటే.. గబ్బిలాలు ఉన్న మాట వాస్తవమే కాని అలెక్స్ శేర్ చేసిన ఫోటో మాత్రం రీసెంట్ ది కాదు అని.. అది రెండేళ్ల క్రితం ఫోటో..దానికి అలెక్స్ అపాలజి చెప్తూ..ఇది శేర్ చేయడం వల్ల నేను కొత్త విషయాలు తెలుసుకోగలిగాను అంటూ మరో కామెంట్ చేశాడు..నిజానికి అతిపెద్ద గబ్బిలాలు ఉన్న మాట నిజమే..కాని వీటి వల్ల మనుషులకు ఎలాంటి నష్టం లేదు.. ఇవి కేవలం పండ్లు మాత్రమే తింటాయి. వీటిని గోల్డెన్ క్రౌన్డ్ ఫ్లైయింగ్ ఫాక్స్ మరియు గోల్డెన్ క్యాప్ ఫ్రూట్ బ్యాట్ అని పిలుస్తారు..ఇవి అంతరించిపోతున్న గబ్బిలం జాతిలో ఒకటి. .
Advertisements
Advertisements