Advertisement
తమిళ చిత్రమైన మన్ వాసనై ను మొదటగా NTRకు చూపించి, ఆయన సలహా మేరకు కథలో కొత్త మార్పులు చేసి ….బాలకృష్ణ ను హీరోగా, సుహాసినిని హీరోయిన్ గా పెట్టి కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం “మంగమ్మగారి మనవడు”. బొమ్మ దద్దరిల్లింది., కాసుల వర్షం కురిసింది…. మంగమ్మ గారి మనవడు యూనివర్సల్ హిట్ అయ్యింది. రికార్డులకు రికార్డులు గాల్లో కల్సిపోయాయి
కథ
భానుమతి (మంగమ్మ) మనవడు(కొడుకు కొడుకు) బాలకృష్ణ. మనవరాలు (కూతురి కూతురు) సుహాసిని….కానీ అల్లుడి తప్పుడు పనులు మంగమ్మకు నచ్చవు….. అందుకే ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచింది. అదే సమయంలో మనవడు, మనవరాలికి ఒకరంటే ఒకరికి ఇష్టం. తాగిన మత్తులో ఎద్దును ఓడించిన వారికి తన కూతుర్నిచ్చి పెళ్లిచేస్తానంటాడు మంగమ్మ అల్లుడు….మోసం చేసి పందెంలో ఎద్దును ఓడిస్తారు. ఇదే సమయంలో పందెంలో కూతుర్ని తీసుకొచ్చి తీర్చుకోలేని తప్పు చేశానని భావించిన తన మంగమ్మ అల్లుడు ఆత్మ_ హత్య చేసుకుంటాడు. గొడవల కారణంగా బాలకృష్ణ ఊరొదిలి వెళ్లాల్సి వస్తుంది…అలా మిలటరీ జాయిన్ అయ్యి అక్కడ మేజర్ కు ఇచ్చిన మాట ప్రకారం అతని చెల్లిని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…..ఇటు ప్రాణంగా ప్రేమించిన మరదలు, అటు ఇచ్చిన మాట…ఏం చేయాలో తోచని పరిస్థితిలో మేజర్ చెల్లిని ఊరికి తీసుకొస్తాడు…..కానీ చివరకు తన మరదలితోనే పెళ్లి అవుతుంది.
Advertisement
Advertisements
హైలెట్స్ ఆఫ్ ది మూవీ.
Advertisements
- మంగమ్మగారి మనవడు చిత్రంతో బాలకృష్ణ స్టార్ హీరో స్థాయికి ఎదిగి పోయారు అంతకు ముందున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ వందరెట్లు పెరిగిపోయింది.
- బాలకృష్ణతో పాత్రతో భానుమతి పాత్ర కూడా ఎప్పటికీ నిలిచిపోయేలా మలిచారు.
- 5 వారాలు పాటు 6 కేంద్రాల్లో హౌసపుల్స్ స్టేట్ రికార్డు
- జంటనగరాల్లో 3 కేంద్రాల్లో 175 రోజుల పైగా కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన తొలిచిత్రం
- 50 రోజులకు అతి తక్కువ ప్రింట్ల పై కోటి రూపాయలు వసూలు చేసిన తొలిచిత్రం
- దంచవే మేనత్త కూతురా….ఈ పాట ఈ సినిమాలోదే!
- శ్రీ సూర్యనారాయణా మేలుకో పాటను…ఈ సినిమా కోసం స్వయంగా భానుమతి గారే పాడారు!