Advertisement
విమర్శకులు సైతం ప్రశంసించే డైరెక్టర్….ప్రతి హీరో ఆయనతో ఒక్క సినిమాలో అయినా నటించాలనుకునే డైరెక్టర్! ప్రతి ఫ్రేములో వైవిధ్యం, కథలో కొత్తదనం, పాత్రల్లో జీవం……దటీజ్ మణిరత్నం! ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో అగ్రగణ్యుడు! అలాంటి మణి రత్నం డైరెక్షన్ లో టాప్ లేపిన 7 సినిమాలు!
1. గీతాంజలి
అక్కినేని నాగార్జున హీరోగా 1989 లో మణిరత్నం తెలుగులో నేరుగా చేసిన చిత్రం గీతాంజలి! “యంగ్ డై ఫస్ట్” అనే ఇంగ్లీష్ సినిమా ప్రేరణతో మణి రాసుకన్న కథే గీతాంజలి!ఢిల్లీ కి చెందిన 11 సంవత్సరాల బాలిక తాను త్వరలో చనిపోనున్నాని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరే ( గీతాంజలి) పెట్టాడు. 60 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 19 మే 1989 లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
2. నాయకుడు
తమిళనాడు నుండి ముంబాయ్ కు వలస వచ్చి అక్కడ గాడ్ ఫాథర్ గా ఎదిగిన వరదరాజన్ ముదలియార్ ప్రేరణతో మణి తీసిన చిత్రం నాయకుడు… ఈసినిమాకోసం 1987లోనే కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. హీరోగా చేసిన కమల్ హాసన్ కు 17 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారు.! ఇది తమిళ్ లో తీయగా తెలుగులోకి డబ్ చేశారు.
Advertisements
3. దళపతి
1991 లో మణి రత్నం తమిళ్ లో తీసిన తళపతి డబ్బింగే తెలుగులో దళపతి! ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ , మలయాళం స్టార్ మమ్ముట్టి పోటీపడి నటించారు. ఈ సినిమా బడ్జెట్ 3 కోట్లు!
Advertisement
4 .రోజా
1922 లో కాశ్మీర్ సమస్య పై మణి తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం రోజా.! అరవింద్ స్వామి నటన, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అదుర్స్! ఈ సినిమాకు 1993లో మూడు ఫిల్మ్ పేర్ అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీల్లో ఈ అవార్డులు లభించాయి.
5. బొంబాయి
ముంబాయ్ మతకలహాల నేపథ్యంలో తెరకెక్కిచిన చిత్రం బొంబాయి. మొదట ఈ సినిమాకు విక్రం ను హీరోగా అనుకున్నారు. కానీ అంతకు ముందే విక్రం వేరే సినిమాకు కమిట్ అయ్యి ఉండడం, దానికి తోడు ఆ సినిమాకు పెంచిన హెయిర్ స్టైల్ ను మార్చడం ఇష్టంలేని విక్రం ఈ సినిమాను వదులుకున్నాడు. దీంతో ఈ సినిమా అరవింద్ స్వామికి వచ్చింది. ఈ సినిమా ఎడిటర్ సురేష్ కు జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. ఈ సినిమాకు రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.
6. సఖి
2000 లో వచ్చిన సఖి సినిమా ఓ మాస్టర్ పీస్…సఖి ఎవర్ గ్రీన్ ఆల్బమ్! మాధవన్ , షాలిని మధ్య కెమిస్ట్రీ , మణి రత్నం టేకింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి!
7. యువ
2004 లో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా యువ. సూర్య, మాధవన్, సిద్దార్థలు హీరోలుగా నటించారు. స్టూడెంట్ పాలిటిక్స్ బేస్డ్ గా ఈ సినిమా తీశారు.
Advertisements
- నోట్ గీతాంజలి సినిమా మినహా మిగితా సినిమాలన్నీ తమిళ్ లో తీసి, తర్వాత తెలుగులోకి డబ్ చేశారు.
- 2002 లో మణిరత్నం కు భారతప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్నందించిది!