Advertisement
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓ మద్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు సమాధానాలిస్తున్నాడు.
- ఆర్మీ ఆఫీసర్: ఆర్మీలో చేరాలని ఎందుకు అనుకుంటున్నావు.
- యువకుడు: పరమ వీర చక్ర అవార్డ్ గెలుద్దామని.
- ఆర్మీ ఆఫీసర్: నవ్వి….అతని ఫైల్ పై సంతకం చేశాడు
1999 కార్గిల్ యుద్దం జరుగుతోంది. 24 ఏళ్ల యువకుడు 1/11 గోర్ఖా రైఫిల్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు. ఖలుబార్ కొండలపై బటాలిక్ సెక్టారులోని జుబర్ టాప్ ను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని ముందుకు కదలుతున్నాడు. ఎదురుగా పాకిస్థాన్ సైనికుల బాంబులు… వాటిని లెక్కచేయకుండా ముందుకు వెళ్ళడమే కాకుండా తన తోటి సైనికులను కూడా ఉత్తేజ పరుస్తున్నాడు. బాంబులను తప్పించుకుంటూ వెళ్లి శత్రువుల మొదటి బంకర్ ను స్వాధీనం చేసుకున్నాడు.
Advertisement
నాయకుడి తెగువను చూసి మిగితా సైనికులు మరింతగా రెచ్చిపోయి రెండవ బంకర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మూడవ బంకర్ వైపుగా వెళుతున్న సమయంలో ఆ నాయకుడి దేహం నుండి శత్రు బుల్లెట్ దూసుకుపోయింది. అయినా… గ్రెనేడ్ వేయండి… స్వాధీనం చేసుకోండి….విడిచిపెట్టొద్దు వాళ్లని….అంటూనే అమరుడయ్యాడు.
Advertisements
Advertisements
బంకర్ స్వాధీనం అయ్యింది… ఆ యుద్దంలో ఇండియా గెలిచింది… కానీ ఆ 24 ఏళ్ల యువకుడు లేడు.! అతని ధైర్య సహాసాలకు దేశం అతనికి పరమవీరచక్ర అవార్డ్ నిచ్చింది. అతనెవరో కాదు మొదట ఇంటర్వ్యూలో తన లక్ష్యం పరమవీర చక్ర అని గర్వంగా చెప్పిన వ్యక్తే… పేరు మనోజ్ కుమార్.
సెల్యూట్ మనోజ్ కుమార్ …సెట్యూట్