Advertisement
ఓ డాక్టర్ కొత్తగా ఇళ్లు కొనుక్కొని గృహప్రవేశం చేశాడు! ఓ రోజు తెల్లవారి లేచి చూసే సరికి సింక్ లోని ట్యాప్ ఓపెన్ చేసి ఉంది! అరే….రాత్రి ట్యాప్ ఆఫ్ చేయకుండా మర్చిపోయానేమోనని ఈ రోజు నుండి జాగ్రత్తగా పడుకొనే ముందు ట్యాప్ ఆఫ్ చేసి మరీ పడుకున్నాడు..అయినా ఉదయం లేచి చూసే సరికి …మళ్లీ ట్యాప్ ఓపెన్ చేసి ఉంది!
Advertisement
ఓ పండితుడిని సంప్రదిస్తే అతను… ఇంట్లో వాస్తు దోషముంది! నివారణకు హోమం చేయాలి…25 వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు! 25 వేలు ఎక్కువ అని…. ఓ మంత్రగాడిని సంప్రదిస్తే….అతడు ఇంట్లో ప్రేతాత్మ ఉందని చెప్పి….దాన్ని పంపించడానికి 20 వేలు అవుతుందని తెలిపాడు.!
Advertisements
ఆలోచనలో పడ్డ ఆ డాక్టర్….అసలు రాత్రి తన ఇంట్లో ఏమౌతుందో తెలుసుకోవాలని CC కెమెరాలను పెట్టించాడు! మరునాడు ఉదయం CC కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను చూసి….ఆశ్చర్యపోయాడు.! ఆత్మ లేదు ప్రేతాత్మ లేదు…. ఓ ఎలుక వచ్చి ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు తాగేసి వెళ్లిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.! మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి…గుడ్డిగా నమ్మకుండా హేతు బద్దంగా ఆలోచించాలి!
Advertisements