Advertisement
చిన్నప్పుడు మనం సైన్స్ పాఠ్య పుస్తకాల్లో మేరీ క్యూరీ, పియరీ క్యూరీల గురించి తెలుసుకున్నాం కదా. వారు 1898లో ఓ నూతన రేడియో ధార్మిక పదార్థాన్ని కనుగొన్నారు. దానికి వారి మాతృదేశం పోలండ్ పేరిట పొలొనియం అని పేరు పెట్టారు. అయితే మేరీ క్యూరీ అప్లాస్టిక్ అనీమియా అనే వ్యాధి కారణంగా చనిపోయింది. చాలా కాలం పాటు అధికంగా రేడియేషన్ బారిన పడడం వల్ల ఆమెకు తీవ్రమైన అనారోగ్యం సంభవించి చనిపోయింది. కాగా మేరీ క్యూరీకి సంబంధించిన అనేక వస్తువులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ అవి రేడియేషన్‌ను విడుదల చేస్తుండడం విశేషం.
మేరీ క్యూరీ, ఆమె భర్త పియరీ క్యూరీలు అప్పట్లో రేడియం, పొలొనియం వంటి రేడియో ధార్మిక పదార్థాలపై పరిశోధనలు చేసేవారు. దీని వల్ల మేరీ క్యూరీ తీవ్రమైన రేడియేషన్ బారిన పడి చనిపోయింది. అయితే అప్పట్లో మేరీ క్యూరీ వాడిన నోట్ బుక్స్, ఆమె ఇంట్లోని ఫర్నిచర్, రీసెర్చ్ పేపర్లు, ఇతర వస్తువుల నుంచి ఇప్పటికీ రేడియేషన్ విడుదలవుతోంది. అందుకనే పరిశోధకులు ఆయా వస్తువులను పరిశీలించాల్సి వస్తే.. ప్రత్యేకంగా తయారు చేయబడిన హజ్మట్ సూట్లను ధరించి మరీ వాటిని పరిశీలిస్తారు.
Advertisement
ఇక మేరీ క్యూరీకి చెందిన ఆయా వస్తువుల నుంచి రేడియేషన్ మరో 1500 ఏళ్ల వరకు విడుదల అవుతూనే ఉంటుందని పరిశోధకులు తెలిపారు. రేడియో ధార్మిక పదార్థాలు అంత త్వరగా క్షీణించవు. కొన్ని వందల ఏళ్ల సమయం పడుతుంది. అందుకనే అప్పట్లో ఆమె వాడిన ఆయా వస్తువుల నుంచి ఇప్పటికీ రేడియేషన్ విడుదలవుతూనే ఉందని పరిశోధకులు తెలిపారు.
కాగా మేరీ క్యూరీకి చెందిన రీసెర్చ్ పేపర్లతోపాటు పలు వస్తువులను ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న బిబ్లియోతీక్ నేషనల్‌లో భద్ర పరిచారు. పాదరసంతో తయారు చేసిన ప్రత్యేకమైన బాక్సుల్లో ఆయా వస్తువులను, రీసెర్చి పేపర్లను ఉంచారు. వాటిని పరిశీలించేందుకు సైంటిస్టులు పైన తెలిపిన విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఒకేసారి నోబెల్ బహుమతి సాధించిన తొలి వ్యక్తిగా, తొలి మహిళగా మేరీ క్యూరీ పేరిట రెండు రికార్డులు ఉన్నాయి.
Advertisements
Advertisements