Advertisement
పెళ్లి గురించి , పెళ్లి షాపింగ్ గురించి అనేక కలలుంటాయి..ఎన్నో జ్ణాపకాలు ముడిపడుంటాయి…కొందరికి తీపి జ్ణాపకాలు, కొందరికి చేదు జ్ణాపకాలు…అదృష్టవశాత్తూ నాకు అన్ని తీపి జ్ణాపకాలే ఉన్నాయి.. వాటన్నింటిని ఇప్పటికి తలచుకున్నా నవ్వొస్తుంది.. సంతోషంతో మనసు పులకించిపోతుంది..
నా పెళ్లి చీర ఖరీదు 200రూ..ఈ రోజుల్లో 10వేల రూపాయల చీరతో సమానం.. ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు నాకోసం మంచి బట్టల్లే కొన్నారని నేను అనుకుంటాను..ఇక పెళ్లిల్లో మేకప్ తో మెరిసిపోయాను.ఫస్ట్ టైం లిప్ స్టిక్,ఫౌండేషన్ క్రీమ్ లను వాడాను..పెళ్లిరొజు నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏదన్నా ఉందా అంటే సర్ఫ్ తో తలస్నానం చేయడం..
కేవలం ఒకే ఒకసారి సర్ఫ్ ఉపయోగించినందుకు తర్వాత నేను పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నాను..ఫ్రెండ్ ఇచ్చిన సలహా ప్రకారం సర్ఫ్ యూజ్ చేసాను..అప్పటి వరకు షీకాయ సోప్, కుంకుడు కాయలు ఉపయోగించేదాన్ని..సర్ఫ్ బాగుంటుంది అనడంతో ఉపయోగించా..ఆ తర్వాత నా జుట్టు ఊడడం ప్రారంభయింది.ఊడుతూనే ఉంది.చాలా జుట్టు ఊడిపోయింది..అది నేను చేసిన అతిపెద్ద తప్పు..
Advertisements
Advertisement
పెళ్లి పూర్తయిన తర్వాత అత్తవారింటికి వెళ్లేటప్పుడు దిగిన ఫోటో..పుట్టింటి వారిని వదిలి వెళ్తున్నందుకు బాధపడే క్షణాలవి..కానీ అతను తన మాటలతో నన్ను నవ్వించాడు..
పెళ్లి తర్వాత కూడా నా చదువు కొనసాగించవచ్చు అని అత్తింటి నుండి,నా భర్త నుండి పర్మిషన్ ఇచ్చారు..అంతే కాదు కావాలంటే పుట్టింట్లోనే ఉండి చదువుకోవచ్చు అన్నారు..దాంతో నేను తిరిగి మా ఇంటికొచ్చా చదువుకోసం..ప్రతి పండుగకు అత్తింటి వారికి నచ్చిన బట్టు కట్టుకుని సైకిల్ పై పుట్టింటి నుండి మా ఆయన వాళ్లింటికి వెళ్లేదాన్ని ..అలా ఒక దీపావలికి వెళ్లినప్పుడు దిగిన ఫోటో ఇది.
Advertisements
ఇవన్ని జరిగి 43ఏళ్లు పైనే అయింది..తర్వాత నేను చదువు ముగించాను..ఎకనమిక్స్ లెక్చరర్ గా పనిచేశాను.. ఇప్పటికి నేను కొంచెం బాధలో ఉన్నా తను నవ్విస్తాడు..బయటకి తీస్కెళ్తాడు..ఈ ఫోటో రీసెంట్ గా మేం బయటకు వెళ్లినప్పటిదే..!