Advertisement
3000 మంది సమక్షంలో …1916,సెప్టెంబర్ 13న మేరీ అనబడే ఈ ఏనుగును ఉరి తీశారు. అప్పటి ఫోటోనే ఇది.! ఆ రోజు మేరీ ట్రాజెడీ పేరుతో చరిత్రలో విషాదంగా మిగిలిపోయింది.!
అసలు ఆరోజు ఏం జరిగిందంటే…..?
స్పార్క్స్ అనే సర్కస్ కంపెనీలో యాక్టివ్ గా ఉండే ఏనుగే మేరి.! అది చేసే సాహాసాలను జనాలు ఎగబడి చూసేవారు.! కానీ కొన్ని రోజులుగా అది దంతాల నొప్పితో బాధపడుతుంది. ఈ విషయాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. సెప్టెంబర్ 11, 1916 నాడు రెగ్యులర్ శిక్షకుడి స్థానంలో కొత్త శిక్షకుడు వచ్చాడు. ఇదేమీ పట్టించుకోని అతడు తన దగ్గరున్న శూలంతో ఏనుగు పంటి మీద గుచ్చాడు…అసలే బాధపడుతున్న మేరీకి శిక్షకుడు చేసిన ఈ పనితో మరింత నొప్పి కలిగింది.
Advertisement
సహానాన్ని కోల్పోయిన మేరీ…శిక్షకుడిని లాగి కిందకు పడేసింది. అంతటితో ఆగక తన కాలితో తొక్కింది. శిక్షకుడు అక్కడిక్కడే చనిపోయాడు. రాక్షస ఏనుగును చంపేయండి అంటూ జనాల్లోంచి అరుపులు వినిపించాయి….కాల్పులు కూడా ప్రారంభమయ్యాయి.! తన తప్పును తెల్సుకున్న మేరీ కామ్ గా అక్కడే కూర్చుండిపోయింది.
Advertisements
Advertisements
అయినప్పటికీ శాంతించని జనాలు….మేరీని చంపాల్సిందేనని ఓనర్ దగ్గరికి వెళ్లి పట్టుపట్టారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో …సెప్టెంబర్ 13, 1916 పెద్ద క్రేన్ తో మేరికి ఉరి వేసే ప్రయత్నం చేశారు. రెండు సార్లు తాడ్లు తెగి మేరి కిందపడడంతో ….నడుములు విరిగాయి…. అయినా విడవకుండా మూడోసారి ఉరేశారు. విలవిలలాడుతూ మేరి చనిపోయింది.