• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

సు+ఆస్తిక్ = స్వ‌స్తిక్….అంటే మంచి క‌లుగుగాక‌.! అస‌లు ఈ స్వ‌స్తిక్ చిహ్నం విశిష్ట‌త‌, పుట్టు పూర్వోత్త‌రాల గురించి తెలుసుకుందాం.!

July 13, 2020 by Admin

Advertisement

భార‌తీయులు స్వ‌స్తిక్‌(卍)ను ఎంతో ప‌విత్ర‌మైందిగా భావిస్తారు. దేశంలో అనేక మ‌తాల‌కు చెందిన వారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉప‌యోగిస్తారు. సుమారుగా 12వేల ఏళ్ల కింద‌టి నుంచి స్వ‌స్తిక్ మ‌నుగ‌డ‌లో ఉంద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతారు. కేవ‌లం మ‌న దేశంలోనే కాదు.. అనేక దేశాల‌కు చెందిన వారు స్వస్తిక్‌ను, దాన్ని పోలిన చిహ్నాల‌ను అనేక వేల సంవ‌త్స‌రాల నుంచి ఉప‌యోగిస్తున్నారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజంల‌లో, టిబెట్‌, చైనా, జ‌పాన్‌, గ్రీస్‌, అజ్టెక్‌, సెయ్లాన్‌, హోపి, సెల్ట్‌, బాలి, మాల్టా, ల్యాప్‌లాండ్ వంటి దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ప్ర‌జ‌లు వాడుతున్నారు.

ఉక్రెయిన్‌లోని మెజిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్క‌బ‌డిన ప‌క్షి బొమ్మ‌లో స్వ‌స్తిక్ చిహ్నాన్ని గుర్తించారు. అది సుమారుగా 13వేల ఏళ్ల కింద‌టిద‌ని నిర్దారించారు. సంస్కృతంలో సు అంటే మంచి, శుభం అని అర్థాలు వ‌స్తాయి. అలాగే అస్తి అంటే క‌లుగు గాక అని అర్థం వ‌స్తుంది. రెండింటినీ క‌లిపితే సు + అస్తి = స్వ‌స్తిగా మారుతుంది. అంటే మంచి ఆరోగ్యం లేదా శుభం క‌లుగుతుంది అని అర్థం అన్న‌మాట‌. అందుక‌నే ఈ చిహ్నం త‌మ‌కు అన్ని విధాలుగా మంచి చేస్తుంద‌ని చెప్పి అనేక మంది దీన్ని వాడ‌డం మొద‌లు పెట్టారు.

స్వ‌స్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖ‌లు ప్ర‌కృతి పున‌ర్జ‌న్మ‌ను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక‌, మ‌ర‌ణం ఒక‌దాని త‌రువాత ఒక‌టి నిరంత‌రాయంగా జ‌రుగుతుంద‌ని అర్థం. స్వ‌స్తిక్ చుట్టూ వృత్తాన్ని గీస్తే వ‌చ్చే చిహ్నం సూర్యున్ని ప్ర‌తిబింబిస్తుంది. అది కాంతికి జ‌న్మ‌స్థానంగా చెప్ప‌బ‌డుతుంది. అది విశ్వంలో న‌లువైపులకు వ్యాపిస్తుంది.

Advertisements

స్వ‌స్తిక్‌కు ఉండే నాలుగు రేఖ‌లు నాలుగు దిక్కుల‌ను కూడా సూచిస్తాయి. ఉత్త‌రం, ద‌క్షిణం, తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల‌ను అవి సూచిస్తాయి. స్వ‌స్తిక్ మ‌ధ్య‌లో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్ర‌హ్మ పుట్టాడు. అందువ‌ల్ల స్వ‌స్తిక్ మ‌ధ్య స్థానం నుంచి విశ్వం ఆవిర్భ‌వించి విస్త‌రించింద‌ని చెబుతారు. స్వ‌స్తిక్ మ‌ధ్య భాగాన్ని దైవానికి ప్రతీక అని భావిస్తారు.

Advertisement

స్వ‌స్తిక్ చిహ్నంలో ఒక రేఖ‌ను బ్ర‌హ్మదేవుడిగా భావిస్తారు. మ‌రొక రేఖ‌ను నాలుగు వేదాల‌ని చెబుతారు. మ‌రొక రేఖ‌ను నాలుగు పురుషార్థాల‌ని భావిస్తారు. ఇంకో రేఖ‌ను పౌరులు పాటించాల్సిన ఆశ్ర‌మ ధ‌ర్మాల‌ని చెబుతారు. వేదాలు నాలుగు – రుగ్వేదం, సామ‌వేదం, య‌జుర్వేదం, అథ‌ర్వ‌ణ వేదం. పురుషార్థాలు కూడా నాలుగు – ధ‌ర్మ‌, అర్థ‌, కామ‌, మోక్షాలు. ఆశ్ర‌మ ధ‌ర్మాలు కూడా నాలుగు – బ్ర‌హ్మ‌చ‌ర్య‌, గృహ‌స్థ‌, వాన‌ప్ర‌స్థ‌, స‌న్యాస ధ‌ర్మాలు…

బౌద్ధులు స్వ‌స్తిక్ చిహ్నాన్ని ప్ర‌తిభా పాట‌వాల‌కు, నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ఆధ్యాత్మిక‌త‌కు చిహ్నంగా ఉప‌యోగిస్తారు. నొవాజో అనే ఓ తెగ‌కు చెందిన వారు స్వ‌స్తిక్ చిహ్నాన్ని అనారోగ్యాల‌ను న‌యం చేసేందుకు నిర్వ‌హించే ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల్లో వాడుతారు.

అయితే జ‌ర్మ‌న్ నియంత హిట్ల‌ర్ కూడా స్వ‌స్తిక్ చిహ్నాన్ని త‌న నాజీ సైన్యంలో ఉప‌యోగించాడు. అందువ‌ల్ల స్వ‌స్తిక్‌ను చెడు అనుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. మ‌న దేశంలో ఆర్యులు జ‌ర్మ‌నీ దేశానికి చెందిన పూర్వీకులు అని హిట్ల‌ర్ న‌మ్మేవాడు. అందుక‌నే మ‌న దేశంలో ఎక్కువ‌గా ఉప‌యోగించే స్వ‌స్తిక్ చిహ్నాన్ని హిట్ల‌ర్ త‌న నాజీ సైన్యం చిహ్నంగా ఉప‌యోగించాడ‌ని చెబుతారు. ఇక స్వ‌స్తిక్ చిహ్నాన్ని అనేక ర‌కాలుగా ప్ర‌స్తుతం అనేక మంది వాడుతున్నారు. వాటిల్లో రెండు ర‌కాలు ప్ర‌ధానంగా ఉన్నాయి.

Advertisements

ఎడ‌మ వైపుకు తిరిగి ఉండే లేదా ఎడ‌మ చేతి వాటం స్వ‌స్తిక్ చిహ్నం (卍) ఒక‌టి. కుడి వైపు తిరిగి ఉండే లేదా కుడి చేతి వాటం స్వ‌స్తిక్ చిహ్నం (卐) ఒక‌టి. కుడి వైపుకు తిరిగి ఉండే స్వ‌స్తిక్ చిహ్నాన్ని చాలా మంది ఉప‌యోగిస్తారు.

Filed Under: Mythology

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj