Advertisement
నాకు కాస్త ధైర్యాన్నివ్వండి ప్లీజ్…ఈ రోజు నేనో అమ్మాయి ముందు నోరు తెరిచి నిజం చెప్పబోతున్నాను. లోలోపల చాలా భయంగా ఉంది. నా ఫ్రెండ్స్ ధైర్యం చెప్పారు అయినా ఎందుకో భయం …ఎక్కడ ఆ అమ్మాయి నా నుండి, నా స్నేహం నుండి దూరమవుతుందోనని.!
సరిగ్గా 3 నెలల క్రితం నా చెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ బుక్ కావాలని అడగడంతో…దగ్గర్లోని స్టేషనరీ కి వెళ్ళాను. స్టేషనరీ లో ఫిజిక్స్ బుక్ కోసం వెతుకుతున్నాను. బుక్ దొరికింది. ఇంతలో నా దగ్గరికి ఓ అమ్మాయి వొచ్చి…”ప్లీజ్ ఈ బుక్ నాకిస్తారా? స్టేషనరీ లో ఒకే బుక్ ఉందంట. నాకు దీంతో చాలా అవసరం ఉంది” అంది. ఆ వాయిస్ కు, ఆమె అడిగిన విధానానికి…అప్రయత్నంగానే నా చేతిలోని బుక్ ఆమెకిచ్చేసా.!
Advertisement
మరో సారి బస్టాండ్ లో నన్ను చూసి తనే పలకిరించింది. అప్పటి నుండి అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం …ఆమె ఫిజిక్స్ గురించి మాట్లాడేది. నేను మాత్రం కార్ పార్ట్స్ వాటి పని తీరు గురించి మాట్లాడే వాడిని … చాలా సార్లు నా చదువు గురించి అడిగింది..అలా అడిగిన ప్రతిసారి నేను కార్ల బ్రాండ్స్ గురించి వాటి స్పీడ్ గురించి మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసేవాడిని…ఎందుకంటే నాకు తెలిసినది వాటి గురించే….నేనో కార్ మెకానిక్.!
Advertisements
Advertisements
ఇదే విషయం ఆమెతో చెప్పాలనుకున్నాను ..కానీ ఎక్కడ తను దూరమవుతుందోనని చెప్పలేకపోయాను. నేనలా కార్ల గురించి మాట్లాడుతుంటే…ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేస్తున్నానేమో అనుకునేది తను. “ఎందుకు నీకు కార్లంటే పిచ్చి” అని నవ్వేది. అందుకే ఈరోజు నిజం. చెప్పాలనుకుంటున్నాను- ధైర్యాన్నివ్వండి, తన స్నేహం దూరం కావొద్దని కోరుకోండి. ప్లీజ్.!!!