Advertisement
గుంపులు గుంపులుగా మిడతలు…. వచ్చాయంటే ఒక్క రోజులో 80 టన్నుల దాన్యాన్ని తినేస్తాయి.! రైతుకు నష్టం, దేశానికి తిండిగింజల కష్టం.! డబ్బులు పెట్టినా తిండి గింజలు దొరకని పరిస్థితికి చేరుకుంటాం. ఇప్పటికే పాక్ నుండి గుజరాత్ , రాజస్థాన్ , మహారాష్ట్రలకు వచ్చిన ఈ మిడతలు…తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశానికి రెడీ అయిపోయాయి.
ఈ క్రమంలో …. మిడతలు దాడిచేసినా మన ధాన్యాన్ని ఎలా కాపాడుకోవొచ్చే తెలిపే ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.! పద్మశ్రీ అవార్డ్ గ్రహీత చింతల వెంకట రెడ్డి పద్దతిగా ఫేమస్ అయిన …ఆ సింపుల్ టెక్నిక్ మీకోసం…..

మీ పొలంలో 2 అడుగుల గుంత తీసి…అక్కడి నుండి 4 అడుగుల లోతు వరకు ఉన్న మట్టిని ( ఈ మట్టిలో బంక ఎక్కువగా ఉంటుంది) తీసి 200 లీటర్ల నీటికి 30-40 కేజీల తవ్విన మట్టిని కలిపి పది నిమిషాల పాటు కలియతిప్పాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి….పొలంపై పిచికారీ చేయాలి. ఆ బురద మట్టి ధాన్యంపై పేరుకుపోవడం వల్ల.. మిడతలు వాటిని తినలేవు.. ఎందుకంటే మిడతలకు కాలేయం ఉండదు కాబట్టి ..మట్టి జీర్ణం కాదు. అది తిన్న కాసేపటికే చనిపోతాయి.! ధాన్యంపై పేరుకుపోయిన బురద ఎండ వేడి నుండి కూడా పంటని కాపాడుతుంది.! ఇలా 4-5 సార్లు పిచికారి చేస్తే మిడతలు మీ పొలానికే రావు.!
నోట్ : ఈ పద్దతిని అనుసరించే ముందు మీ AEO ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
Advertisement
మిడతలను అరికట్టడానికి వ్యవసాయ శాఖ సూచించిన చర్యలు
- మిడతలను పంటలలోకి రాకుండా డబ్బాలు, డ్రమ్ములు, లౌడ్ స్పీకర్ లాంటి వాటితో శబ్దం చేయాలి. ఆ సౌండ్ కు మిడతలు పారిపోతాయి.
- 15 లీటర్ల నీటికి 45 మిల్లీ లీటర్ల వేపరసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి
- క్వినోల్ ఫాస్ 1.5 % DP లేదా క్లోరోపైరోఫాస్ 1.5 % DP పొడి మందులను హెక్టరుకు 25 కేజీల చొప్పున పంటలపై చల్లాలి.
- ఎండిన పొలాల్లో లేదా చుట్టుపక్కల మంటలు వేస్తే మిడతలు మంటల్లో పడి నాశనం అవుతాయి
Advertisements
Advertisements