Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

రూట్ మార్చుకున్న మిడ‌తలు, తెలుగు రాష్ట్రాలు సేఫ్.! ఇంత‌కీ మిడ‌తలు రూట్ ఎందుకు మార్చుకున్నాయంటే…!

Advertisement

ఏడారి ప్రాంతాల నుండి బ‌య‌లు దేరిన మిడ‌త‌ల దండు రాజ‌స్థాన్ గుజ‌రాత్ రాష్ట్రాల మీదుగా తెలంగాణ రాష్ట్రానికి 400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న విద‌ర్భ ప్రాంత0 నుండి త‌మ రూట్ మార్చుకొని మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైపు వెళుతున్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఊపిరిపీల్చుకున్నాయి. లేదంటే పంటల మీద ప‌డి పీల్చి పిప్పిచేసేవి ఆ మిడ‌తలు.

ఇంత‌కీ మిడ‌తలు రూట్ ఎందుకు మార్చుకున్నాయి?
మిడ‌త‌లు 2 గ్రాముల నుండి 5 గ్రాముల వ‌ర‌కు బ‌రువు ఉంటాయి. సాధార‌ణంగా ఎగిరే ప్రాణులు గాలిని ఆధారంగా చేసుకొని ప్ర‌యాణం చేస్తుంటాయి. ఈరోజు గాలి ఉత్త‌రం వైపుకు గంట‌కు 15 కిలోమీట‌ర్ల వేగంతో వీయ‌డం కార‌ణంగా…. మ‌హారాష్ట్రలోని విధ‌ర్భ‌లో తిష్ట‌వేసిన మిడ‌త‌లు…త‌మ రూటును గాలి వీచే దిశ‌వైపు మ‌ళ్లించాయి. ఒక వేళ గాలివీచే దిశ‌కు వ్య‌తిరేఖంగా ప్ర‌యాణించాలంటే అవి త‌మ శ‌క్తిని 3 రెట్లు పెంచాల్సి ఉంటుంది. అదే గాలివీచే దిశ‌లో అయితే త‌మ శ‌క్తిలో స‌గం శ‌క్తిని కేటాయించిన స‌రిపోతుంది. గాలి ఉత్త‌రం వైపు వీచింది కాబ‌ట్టి… మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైపుకు వెళుతున్నాయి. అదే ద‌క్షిణం వైపు వీస్తే ఈ పాటికే తెలంగాణ లోకి ఎంట‌ర్ అయ్యిండేయి.!

Advertisement

ఇక మిడ‌త‌లు రాన‌ట్టేనా.?
చెప్ప‌లేము…ఎందుకంటే మిడ‌త‌లు ఒక రోజులో 100 నుండి 150 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయ‌గ‌ల‌వు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుండి మ‌న రాష్ట్రానికి రాడానికి 3 రోజుల స‌మ‌య‌మే ప‌డుతుంది. సో ఈ స‌మ‌స్య‌ పూర్తిగా ప‌రిష్కార‌మైంద‌ని అనుకోలేము.

Advertisements

Advertisements

మిడ‌త‌లు మ‌రిన్ని విష‌యాలు:

  • మిడ‌తల జీవిత కాలం 10 రోజులు
  • ఇవి త‌మ శరీరానికి స‌మాన‌మైన తిండిని తింటాయి.
  • మిడ‌త‌ల దండులో దాదాపు కోటి మిడ‌త‌లుంటాయి.
  • ఇవి ఒక పంట‌మీద దాడికి దిగితే 35 వేల మందికి స‌రిపోయే ధాన్యాన్ని గంట‌లో తినేస్తాయి.
  • వీటికి కాలేయం ఉండ‌దు.