Advertisement
“నమస్తే సార్, నన్ను మన్నించండి. నేనో మోసగాడిని, కానీ కూలీని , నిస్సహాయతలో ఉన్నవాడిని…నేను మీ సైకిల్ తీసుకెళుతున్నాను, బరేలీ వరకు వెళ్లాలి ..నా దగ్గర ఎటువంటి వాహనం లేదు దీనికి తోడు నా కుమారుడు వికలాంగుడు.”
ఇది… ఉత్తర్ ప్రదేశ్ రాజస్థాన్ సరిహద్ద ప్రాంతమైన …. రారహ్ లో కూలీ కోసం వచ్చిన ఇక్బాల్ అనే ఓ వలస కూలీ సైకిల్ ఓనర్ కు రాసిన లెటర్ … దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు కాలినడకనే తమ ఇంటి బాట పట్టారు. ఇక్బాల్ కూడా మొదట కాలినడకనే ఉత్తర్ ప్రదేశ్ లోని తన ఇంటికి వెళ్లాలనుకున్నాడు … 250 కిలోమీటర్లు తను నడవగలడు.. కానీ తన వికలాంగ కొడుకు నడవలేడని తలచి… ఓ ఇంటి నుండి సైకిల్ ను తీసుకొని ఓనర్ కు ఈ లెటర్ రాశాడు.
Advertisement
ఇదే విషయంపై సైకిల్ ఓనర్ స్పందిస్తూ…. “నా సైకిల్ పుణ్యం చేసుకుంది. ఓ కుటుంబాన్ని తమ గమ్యానికి చేర్చింది. కానీ నా సాటి మనిషికి ఇలాంటి స్థితి రావడం బాధాకరం” అన్నాడు.
Advertisements