Advertisement
“కరోనా ప్రారంభమైన వుహాన్ సిటిలో మన ఇండియన్స్ ఉన్నారని స్పెషల్ ఫ్లైట్ లో వారిని ఇండియాకు తీసుకొచ్చారే.., రోడ్లమీద నడుస్తున్న మమ్మల్ని ఎందుకు మీరు పట్టించుకోరు..మేమేమైనా శత్రువులమా” అంటూ ఓ వలసకార్మికుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాడు.
“రోడ్ల మీద ఎదురుచూసి ఎదురుచూసి చివరకు ఓ బస్ ను పట్టుకొని మా ఊరికి వెళ్దామంటే…మద్యలో బస్ ను ఆపి రిటర్న్ పంపి0చేశారు. అవేవో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అంట.! ATM నుండి 4 వేలు డ్రా చేసి పెట్టుకున్నాను…అవి కిరాయి ఖర్చులకే అయిపోయాయి…ఇప్పుడు నా దగ్గర 6 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎలా బతకాలో చెప్పండి..మాకేం వొద్దు ..మా ఇంటికి మమ్మల్ని చేర్చండి చాలు “..అంటూ రంజీత్ శుక్లా అనే ఓ వలస కార్మికుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
Advertisement
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ ప్రాంతానికి చెందిన శుక్ల..బతుకుదెరువు కోసం హర్యానాలో రోహ్తక్ కి వచ్చాడు. ఇతని వెంట ఉన్న వీరి బంధువులది కూడా ఇదే పరిస్థితి.
Advertisements