Advertisement
“మిన్నల్ మురళీ ” అనే మళయాలం సినిమా కోసం వేసిన 50 లక్షల విలువ చేసే చర్చ్ సెట్టింగ్ ను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడడంతో…. సెక్యురిటీ లేకుండా ఉన్న చర్చ్ సెట్టింగ్ ను సుత్తెతో బద్దలు కొడుతూ ధ్వంసం చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో …సదరు వ్యక్తిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.
మిన్నల్ మురళీ అనే సినిమా క్లైమాక్స్ కోసం …ఈ సెట్ ను ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే 50 లక్షలు ఖర్చు పెట్టి ఫిబ్రవరిలోనే కంప్లీట్ చేశారు. అయితే లాక్ డౌన్ కారణంగా క్లైమాక్స్ సీన్ తీయడాన్ని వాయిదా వేశారు ఈ సినిమా దర్శకులు.
“పెరియార్ నదికి పక్కన శివుని విగ్రహంతో పాటు మరో గుడి ఉంది.. దానికి ఎదురుగా ఈ చర్చ్ సెట్టింగ్ ను నిర్మించడంతో మా మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నందుకే” ఈ పని చేసుండొచ్చు అన్నది అంతరాష్ట్ర హిందూ పరిషత్ (AHP ) వాదన.! మొదటి నుండి ఈ సెట్టింగ్ ను వ్యతిరేకిస్తున్నట్టు AHP సభ్యులు తెలిపారు.
సెట్టింగ్ నిర్మాణానికి ముందే…. గ్రామ పంచాయితీ పర్మీషన్, టెంపుల్ అధికారుల పర్మీషన్ , ఇరిగేషన్ అధికారుల పర్మీషన్ తీసుకున్నట్లు తెలిపారు ఈ సినిమా నిర్మాత.
ఈ విషయం పట్ల కేరళ సిఎం విజయన్ సీరియస్ అయ్యారు. “ఈ ఘటన వెనుక ఉన్న వారిని కఠినంగా శిక్షిస్తామ”ని తెలిపారు.
Advertisements
Advertisement
సెట్టింగ్ ఫోటోస్:
Advertisements