Advertisement
మిస్ ఇండియా, మిస్ వరల్డ్ లాంటి పోటీల్లో గెలవాలంటే కేవలం అందం మాత్రమే పరిగణనలోకి తీసుకోరు..వారి అందం,తెలివి, స్పాంటెనిటికి తగ్గ పరీక్షలు పెడతారు..వాటినన్నింటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడినవారే విన్నర్ గా నిలబడతారు.. ప్రిన్స్ మహేశ్ భార్య నమ్రత మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుందనే విషయం అందరికి తెలిసిందే.. అప్పటి నమ్రత పోటీలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.
1993లో నమ్రత మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది..నమ్రతను టైటిల్ విన్నర్ గా ప్రకటించే టైంలోని వీడియోను నమ్రత సిస్టర్, నటి శిల్ప శిరోద్కర్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.ఈ వీడియోలో మాజీ మిస్ ఇండియా సంగీత బిజ్లానీని కూడా చూడొచ్చు..న్యాయనిర్ణేతల్లో తను ఒకరు.. అప్పటి కాంటెస్ట్ లో నమ్రత న్యాయమూర్తులకి ఫేవరెట్ కంటెస్టెంట్ .. ఎవరు గెలుస్తారని సంగీతని అడిగిన ప్రశ్నకు..ఖచ్చితంగా మై ఫేవరెట్ నమ్రతనే అని సంగీత సమాధానం ఇవ్వడం ఆ వీడియోలో చూడొచ్చు..
Watch Video:
Advertisement
తర్వాత నమ్రతను.. “మీరు ఓ ఉదయం లేచేసరికి మీ బెడ్ పై డ్రాకులా నిద్రపోతూ కనిపిస్తే ఏం చేస్తారు??అనే ప్రశ్నని అడిగారు.దానికి సమాధానంగా “నేను నిజంగా భయపడతాను..కానీ తర్వాత ఆ డ్రాకులాతో స్నేహం చేస్తాను”అని సమాధానం ఇచ్చింది. జడ్జెస్ తో పాటు అందరూ క్లాప్స్ కొట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్ని ఆ వీడియోలో తమ ఫేవరెట్ సూపర్ స్టార్ భార్యను యంగ్ ఏజ్ లో చూసుకుని మురిసిపోతున్నారు.
మిస్ ఇండియాగా గెలుపొందాక బాలివుడ్లో కొన్ని సినిమాల్లో నటించింది నమ్రత..మళయాళంలో నటించి..తెలుగులో వంశీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది..ఆ సినిమా సమయంలోనే మహేశ్ తో పరిచయం,ప్రేమతో పెళ్లి చేసుకుని సితార,గౌతమ్ లను చూసుకుంటూ పూర్తి టైంను కుటుంబానికి కేటాయించింది..ప్రస్తుతం పిల్లలు పెద్దగా అయిపోవడంతో సినిమా ప్రొడక్షన్లోకి అడుగుపెట్టింది.
Advertisements