Advertisement
అక్రమంగా కట్టారని కోటి రూపాయలకు పైగా విలువచేసే MLA ఇంటిని కూల్చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.! కాంగ్రెస్ పార్టీకి చెందిన ముక్తార్ అన్సారీకి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని దలీబాగ్ ప్రాంతంలో రెండు మూడంతస్తుల బిల్డింగ్ లు ఉన్నాయి.!
Advertisement
అయితే ఈ బిల్డింగ్ లు ఉన్న స్థలాలు…నిష్‌క్రాంత్ సంపత్తి కిందకు వస్తుంది. అలాగే ఆ స్థలంలో నిర్మాణానికి లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌డీఏ) కూడా ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఎమ్మెల్యే అన్సారీ అందులో రెండు బిల్డింగ్ లు నిర్మించాడు…అది చట్ట విరుద్దమని తెలియడంతో రంగంలోకి దిగిన అధికారులు…ఆ బిల్డింగ్ లను కూల్చేశారు! బ ఆ భవనాల కూల్చివేతలకు అక్కడి ప్రభుత్వ విభాగానికి అయిన ఖర్చులను కూడా ఆ ఎమ్మెల్యే నుంచి వసూలు చేయాలని సీఎం యోగి సర్కారు నిర్ణయించింది. దీంతోపాటు అతని సన్నిహితుడైన బీఎస్‌పీ ఎమ్మెల్యే ఆస్తులను సీజ్ చేశారు. ఘజీపూర్‌కు చెందిన మరో నలుగురు అతని అనుచరులకు చెందిన ఆయుధాల లైసెన్స్‌లను కూడా రద్దు చేశారు.
Advertisements
మరోవైపు యోగి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కావాలనే ఆపోజిషన్ పార్టీ MLA లను టార్గెట్ చేస్తూ ఇలా చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి!
Advertisements