Advertisement
కరోనా వైరస్ దెబ్బతో అందరికి శుచీ శుభ్రత ఎక్కువయింది. ..వైరస్ బారిన పడకుండా ఉండడానికి పదేపదే చేతులు కడుక్కుంటున్నారు, శానిటైజర్ ఉపయోగిస్తున్నారు..వాచ్ , పర్స్ లాంటివి ఉపయోగించకపోవడం మేలని చెప్తే వాటిని దూరం పెట్టారు.. బయటకి వెళ్లి రాగానే స్నానాలు చేసి, బట్టలు నానబెడుతున్నారు..కానీ మొబైల్ పరిస్థితి ఏంటి?? మొబైల్ ని కూడా శానిటైజర్ తో శుభ్రం చేసేస్తున్నారు చాలామంది..దాంతో కొత్త సమస్యలు వస్తున్నాయి.. ఆ సమస్యలు ఏంటి? మొబైల్ ని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకోండి.
మొబైల్ ని శానిటైజర్ తో శుభ్రం చేయడం వలన వచ్చే సమస్యలు..
- శానిటైజర్ నేరుగా ఉపయోగించి క్లీన్ చేసేటప్పుడు హెడ్ ఫోన్ జాక్ లోకి, ఛార్జింగ్ జాక్ లోకి శానిటైజర్ పోవచ్చు..తద్వారా ఛార్జింగ్ పెట్టినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది.
- మరికొన్ని సార్లు స్పీకర్ ప్రాబ్లం కూడా రావచ్చు..
- అంతేకాదు డిస్ప్లే , కెమెరా లెన్సులు కూడా పాడవుతాయి..
Advertisement
మొబైల్ ని ఎలా శుభ్రపరచాలి??
- మొబైల్ ని శుభ్రం చేసే ముందు స్విఛ్చాఫ్ చేయాలి. డైరెక్ట్ గా శానిటైజర్ ని వాడకుండా,కొంచెం దూదిని తీసుకుని శానిటైజర్లో ముంచి దానితో నెమ్మదిగా ఫోన్ ముందువైపు, వెనుక వైపు క్లీన్ చేయాలి..స్క్రీన్ పై క్లీన్ చేసేటప్పుడు గట్టిగా రుద్దకుండా నెమ్మదిగా శుభ్రపరచాలి. దూదికి శానిటైజర్ మరీ ఎక్కువగా ఉండకూడదు..మధ్యస్తంగా ఉండాలి.
- మెడికల్ వైప్స్ దొరుకుతాయి..వాటితో కూడా మొబైల్స్ ని శుభ్రం చేయవచ్చు..
- మొబైల్ షాప్స్ లో యాంటి – బ్యాక్టీరియల్ టిష్యూ పేపర్లు లభిస్తాయి..వాటితో మొబైల్ ని శుభ్రపరిస్తే ఫలితం ఉంటుంది.
Advertisements