Advertisement
ఒక్కో మనిషికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది..ఒక్కో విషయం పట్ల మక్కువ ఉంటుంది.మనలో చాలా మందికి సినిమాలు,స్పోర్ట్స్ ఇష్టం.. తీరిక దొరికితే చూస్తుంటాం..తీరిక చేసుకుని మరీ చూస్తుంటాం.. మరి మనం అభిమానించే పొలిటిషియన్స్ , స్టార్స్ ఎప్పుడూ బిజిగా ఉంటారు కదా..వాళ్లకంటూ అభిరుచులుంటాయా? వాళ్లు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు.. అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే మనలో ఉంటుంది.. ఇదిగో ఈ ప్రశ్నలకు సమాధానాలు…
నరేంద్రమోడీ :
భారత ప్రధాని, ఫేమస్ పొలిటీషియన్, ఎంతో మందికి ప్రోత్సహకరంగా ఉండే వ్యక్తి నరేంద్రమోడీ. చాలామంది నరేంద్రమోడీ ఆలోచనలను ఇష్టపడతారు. మరి ఈయన హాబీ ఏంటో తెలుసా?? ఫోటో గ్రఫీ… మోడీ అనగానే అందరికి ఫొటోలకి ఫోజులిస్తారని అనుకుంటారు కానీ..ఈయన మంచి ఫొటోలు తీయగలడు కూడా.
Advertisements
సచిన్ టెండూల్కర్ :
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి ఉన్న హాబీ ఏంటంటే సిడి లు కలెక్ట్ చేయడం.. ఎన్నో రకాల సిడిల కలెక్షన్ సచిన్ దగ్గర ఉంది.
షారూక్ ఖాన్ :
బాలివుడ్ బాద్షా కింగ్ ఖాన్ కి వీడియో గేమ్స్ ఆడడం అంటే పిచ్చి..షూటింగ్స్ లేనప్పుడు, ఫ్రీటైం దొరికిందంటే చాలూ..వీడియో గేమ్ ఆడుతూ కూర్చుంటాడు.. షారూక్ బుక్ లవర్ కూడా అండీ.. షారూక్ కలల సౌదం మన్నత్ లో పుస్తకాల కోసం పెద్ద లైబ్రరీనే కట్టించుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని :
మిస్టర్ కూల్.. మహేంద్ర సింగ్ ధోనీ రేసర్ అనే విషయం మనందరికి తెలిసిందే..దాన్ని బట్టే తన హాబీ ఏంటో చెప్పేయొచ్చు సూపర్ కార్స్,రకరకాల బైక్స్ కలెక్ట్ చేయడం ధోనీ హాబీ.
ముఖేష్ అంబానీ:
ఇండియన్ బిజినెస్ మ్యాగ్నేట్, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ.. ప్రపంచకుబేరుల్లోనే ఒకరు.. అంత పెద్ద వ్యక్తి ఎంత బిజిగా ఉంటారో, ఆయనకేం హాబీస్ ఉంటాయనుకుంటున్నారా? ..హిందీ సినిమాలు చూడడం ముఖేష్ అంబానీ హాబీ..ప్రస్తుతం ఏకంగా సినిమాలను నిర్మిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ :
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయనకు ఎప్పుడు తీరిక దొరికినా.. బ్లాగ్ లో స్పెండ్ చేసేస్తారు.
రజిని కాంత్ :
సూపర్ స్టార్ రజని కాంత్ కి పుస్తకాలు చదవడం హాబీ.
Advertisement
అమీర్ ఖాన్ :
బాలివుడ్ స్టార్ అమీర్ ఖాన్ కి కూడా బుక్ రీడింగ్ హాబీ..షూటింగ్ గ్యాప్ లో కూడ బుక్ పట్టుకుని చదువుకుంటూ కూర్చుంటాడు అమీర్..
సల్మాన్ ఖాన్: కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాస్త తీరిక సమయం దొరికినా.. వెంటనే పెయింటింగ్ మొదలుపెట్టేస్తాడు. పెయింటింగ్ అంటే.. అంత ఇష్టం సల్లూభాయ్ కి.
అనిల్ అంబానీ :
ఫిట్నెస్ కి అనిల్ చాలా ప్రాధాన్యత ఇస్తారు,. అనిల్ కి మారథాన్ లో పాల్గొనడం అంటే ఇష్టం..ఎక్కడ మారథాన్ ఉన్నా అనిల్ వాలిపోతారు.
విరాట్ కొహ్లీ :
విరాట్ కొహ్లీకి ప్రయాణాలంటే ఇష్టం..ఎప్పుడూ కొత్తకొత్త ప్లేసెస్ కి వెళ్లడానికి ఇష్టపడుతుంటాడు విరాట్..లక్కీగా అనుష్కకు కూడా ప్రయాణాలంటే ఇష్టం ..కానీ మ్యూజిక్ వింటూ ప్రయాణాలు చేయడం సరదా..ఒకప్పుడు ఒంటరిగా ప్రయాణాలు చేసే ఈ జంట పెళ్లయ్యాక జంటగా కొత్తప్లేసెస్ ని చుట్టేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ :
అమెరికా అధ్యక్షుడికి కూడా ఒక హాబీ ఉందండోయ్..ఖాళీ దొరికితే చాలూ గోల్ఫ్ ఆడడానికి రెడీ అయిపోతాడు ట్రంప్.
ఐశ్వర్యారాయ్ :
అందానికే ఐకాన్ అయిన ఐశ్వర్యారాయ్.. సినిమాల్లో నటనతో ఆకట్టుకోవడం, ప్రేక్షకాధరణ పొందడం గురించి అందరికీ తెలుసు. ఈ బ్యూటీ క్వీన్ హాబీ ఏంటనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం… కుట్లు, అల్లికలు అంటే ఐశ్వర్యకు చాలా ఇష్టం..వాటిని కలెక్ట్ చేయడం..తీరిక దొరికినప్పుడు తన చేత్తోనే కొత్త డిజైన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది.
దీపికా పదుకొనె “:
సిల్వర్ స్క్రీన్ అందం, అభినయంతో అలరించే ఈ ముద్దుగుమ్మ.. స్పోర్ట్స్ అంటే ఎనలేని ప్రేమ. దీపికాకు బ్యాడ్మింటన్ ఆడటం చాలా ఇష్టమట.
కంగనా రనౌత్ :
క్వీన్ కంగనా రనౌత్ కి నోరూరించే వంటకాలు చేయడం హాబీ..తీరిక దొరకితే చాలు కిచెన్ లోకి వెళ్లిపోయి గరిటె చేతపట్టి వంట చేయడానికి రెడీ అయిపోతుంది ఈ అమ్మడు.
Advertisements