డిఫరెంట్ డైలాగ్ డెలివరీ , అంతకంటే డిఫరెంట్ మ్యానరిజంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు మోహన్ బాబు.! మొదట రౌడీ క్యారెక్టర్లతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మోహాన్ బాబు తర్వాత హీరోగా మారి అటు తర్వాత కలెక్షన్ కింగ్ గా పేరు సంపాధించుకున్నాడు. ఆయన కెరీర్ లో టాప్ 10 సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
1. అసెంబ్లీ రౌడీ:
మోహన్ బాబు దివ్యభారతి కాంబినేషన్లో , ఫుల్ కమర్షియల్ ఫార్ములాతో సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ గా మోహన్ బాబుని ఒక స్థాయిలో నిలబెట్టిన సినిమా ఇది! పరుచూరి డైలాగ్స్ ఈ సినిమా స్థాయిని పెంచితే…. కె వి మహదేవన్ మ్యూజిక్ , ఏసు దాసు గాత్రం ఈ సినిమాకు నిండుదనాన్ని తీసుకొచ్చాయి . 1992 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా మోహన్ బాబే .
2. పెదరాయుడు:
రజినీకాంత్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ సినిమా మోహన్ బాబు కెరీర్లోనే అల్ టైమ్ హిట్ ! ఈ సినిమాను రవిరాజ పినిశెట్టి డైరెక్ట్ చేసాడు . ఈ మూవీలో మోహన్ బాబు డబుల్ రోల్ చేయగా , సౌందర్య , భాను ప్రియ హీరోయిన్లుగా నటించారు.! విలన్ గా నటించిన ఆనంద్ రాజ్ కి ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.
3. అల్లుడు గారు:
చక్కటి ఎమోషనల్ అండ్ కామెడి ఫిల్మ్. శోభనతో మోహన్ బాబు హాస్య సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఉరిశిక్ష పడ్డ ఖైదీ గుండెలనిండా దుఃఖాన్ని పెట్టుకొని పైకి నవ్వుతూ నవ్విస్తూ చివరిలో అందరిచేత కంటతడి పెట్టించే మోహన్ బాబు పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది . ఈ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు.
4. మేజర్ చంద్రకాంత్:
ఎన్టీఆర్ తో కలిసి మోహన్ బాబు నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ ! మిలటరీ మేజర్ అయిన తండ్రికి దొంగగా మారిన కొడుకుకి మధ్య వచ్చే ఏమోషనల్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి .ఈ సినిమాని మోహన్ బాబే ప్రొడ్యూస్ చేయగా మంచు మనోజ్ ఈ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా కనిపిస్తాడు.
5. శ్రీరాములయ్య:
1998 లో రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రీహరి, హరికృష్ణ, సౌందర్య, కోట శ్రీనివాసరావు , ప్రధాన పాత్రల్లో నటించారు. వందేమాతరం అద్భుతమైన సంగీతం అందించిన ఈ సినిమా మోహన్ బాబు కెరీర్లో ఓ ఆణిముత్యంగా నిలిచిపోయింది.
6. అల్లరి మొగుడు:
రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన మరో సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ అల్లరి మొగుడు. మీనా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో ….. అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు ఎలా సంగీత కళాకారుడుగా మారి చేసిన తప్పుకు ప్రాయశ్చితపడే పాత్రలో అద్భుతంగా నటించాడు మోహన్ బాబు. ఈ సినిమాకు ఏ
ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు .
7. రౌడీ గారి పెళ్ళాం:
1991 లో వచ్చిన ఈ సినిమాలో మోహన్ బాబు కి జతగా శోభన చాలా అద్భుతంగా నటించింది. సీరియస్ గా సాగే మోహన్ బాబు నటనలో కొత్త రకం కామెడీని ఈ సినిమాలో చూడొచ్చు .
8.బ్రహ్మ:
వి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 1992 లో రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు సంపాదించుకుంది . ముసిముసి నవ్వులలోన పాట ఈ సినిమాలోనిదే!
9.అడవిలో అన్న:
వి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన మరో మూవీ అడవిలో అన్న…. మోహన్ బాబు నక్సలైట్ గా ఎందుకు మారాల్సొచ్చిందే ఈ సినిమాలో చూపించారు . వందనాలమ్మ పాట ఈ సినిమాలోనిదే! ఈ సినిమాలో మోహన్ బాబు కు జతగా రోజా నటించింది.
10. రాయలసీమ రామన్న చౌదరి:
సొంత నిర్మాణ సంస్థలో మోహన్ బాబు నటించిన ఈ సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యింది . జయసుధ , చంద్రమోహన్ , ఇతర పాత్రల్లో నటించగా మోహన్ బాబు నటన విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడొచ్చు . కలక్షన్స్ పరంగా ఈ సినిమా నిరాశ పరిచినా కథ పరంగా దమ్మున్న సినిమా ఇది!