Advertisement
ముక్కాబులా సాంగ్ తో మొదలైన బిగ్ బాస్ సోమవారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు అందరూ అదిరిపోయే స్టెప్పులు వేశారు.ఆతరువాత అభిజిత్ మోనాల్ లేదా హారిక తో ముచ్చట్లు పెడుతూ కెమెరాలకు రోజు దొరికిపోతున్నాడు
ఇక దివి, అభిజిత్ ను మొనాల్-హారికలలో నువ్వు ఎవర్ని సేవ్ చేసేవాడివనే ప్రశ్నించింది. దానికి అభిజిత్ చెరో సగం చేస్తానని అన్నాడు ఆతరువాత హారిక పక్కన ఉండడంతో నేను హారిక ను సేవ్ చేసేవాడినని ఎందుకంటే ఆమె మోనాల్ కంటే బెటర్ అని అన్నాడు.ఇక మెహబూబ్ తనని నామినేట్ చేయడం బాధగా లేదని కాని అతను చెప్పిన కారణం చాలా సిల్లీగా ఉందని అది నా ఇగోని హర్ట్ చేసిందంటూ హారిక తెగ ఫీల్ అయ్యింది.
ఇక అరియానా గ్లోరీతో దేవి గురించి అమ్మ రాజశేఖర్ మాస్టర్ చాలాసేపు చర్చించారు. నేను ఏ రోజు డైరెక్టర్ అని ఫీల్ అవ్వలేదు.. వృత్తి కోసం చర్చించాల్సిన అవసరం లేదని రాజశేఖర్ మాస్టర్ తెగ ఫీల్ అయ్యాడు.
ఆనియన్స్ కట్ చేసిన తరువాత టేబుల్ క్లీన్ చెయ్ అని అరియానా సొహైల్‌ని కోరడంతో సొహైల్ సీరియస్ అయ్యాడు.నువ్వు నాకు చెప్పకు.. ఆర్డర్లు వేయకు అని అరియానా పై ఫైర్ అయ్యాడు.ఇక బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త వారం మొదలవ్వడంతో కొత్త రేషన్ డీలర్ గా ఇంటి సభ్యులు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి
అభిజిత్‌ను ఎన్నుకున్నారు.
Advertisement
ఇక కల్యాణి వేసిన బిగ్ బాంబ్ కారణంగా మూడో వారం ఎలిమినేషన్ లో దేవి డైరెక్ట్ గా చేరింది.ఇక హౌస్ కెప్టెన్‌గా ఉన్న నోయల్ ఒకర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేయవలసిందిగా బిగ్ బాస్ ఆదేశించారు.దీంతో నోయల్ యాంకర్ లాస్యను నామినేట్ చేశాడు. ఇక మిగిలిన ఇంటి సభ్యులు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు.
Advertisements
దానితో
మెహబూబ్ – అరియానా గ్లోరీ, హారిక
దేవి – రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి
దేత్తడి హారిక – మొహబూబ్, సుజాత
అవినాష్ – మొహబూబ్, హారిక
దివి – మొనాల్ గజ్జర్, కుమార్ సాయి
అభిజిత్ – అరియానా గ్లోరి, సుజాత
కుమార్ సాయి – మెహబూబ్, అఖిల్ సార్థక్
గంగవ్వ – కుమార్ సాయి, మొనాల్ గజ్జర్
రాజ శేఖర్ – అరియానా గ్లోరి, కుమార్ సాయి
మొనాల్ గజ్జర్ – అరియానా గ్లోరి, దివి
అఖిల్ సార్థక్ – కుమార్ సాయి, అరియానా గ్లోరి
సొహైల్ – అరియానా గ్లోరి, కుమార్ సాయి
లాస్య – కుమార్ సాయి, అరియానా గ్లోరి
అరియానా గ్లోరీ – మొనాల్ గజ్జర్, మెహబూబ్
జోర్దార్ సుజాత – దేత్తడి హారిక, అభిజిత్
Advertisements
నామినేట్ చేశారు.దీనితో మూడో వారం ఎలిమినేషన్ రేసులో యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు నామినేట్ అయ్యారు.మరి ఇదండీ సోమవారం జరిగిన విశేషాలు. ఇక మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం రేపు కలుసుకుందాం.