Advertisement
సోమవారం వంటగదిలో కలిసున్న అఖిల్ సిద్దార్థ్ ను పాట పాడమని మోనాల్ కోరింది.ఆమె కోరిక మేర అఖిల్ పాట పాడాడు. ఈ టైంలో తెగ సిగ్గుపడిన మోనాల్ అఖిల్ కు దిష్టి తగలకుండా ఉండడం కోసం దిష్టితీసింది.అక్కడితో ఆగకుండా
కెమెరాల ద్వారా అఖిల్‌ని మొనాల్ తన తల్లికి పరిచయం చేసింది.
ఇక అర్థరాత్రి అభిజిత్ మొనాల్ తో మాట్లాడాలని అందుకు 5 నిమిషాలు టైం ఇవ్వమని అడిగాడు.సరే మోనాల్ ముందుకి రావడంతో అభిజిత్ ‘నా మీద నీకు డౌట్ ఉందా..? నన్ను పూర్తిగా నమ్ముతున్నావా?’అంటూ మోనాల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.దీనికి మొనాల్ ‘నేను నీతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నా కాని.. టైం లేదు’ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.ఈ టైంలో అభిజిత్ ‘నాకు నీతో మాట్లాడాలని ఉంది.. నీతో టైం గడపాలని ఉంది’ అంటూ ఫీల్ అయ్యాడు.ఇది తట్టుకోలేని మోనాల్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది.
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి ఇంటి సభ్యుల్ని సర్ ప్రైజ్ చేసేందుకు తెగ ప్రయత్నించాడు. కానీ దీన్ని యాంకర్ దేవి, దివిలు పసిగట్టారు.ఇక మార్నింగ్ వేకప్ సాంగ్‌కి ఇంటి సభ్యులంతా అదిరిపోయే స్టెప్పులు వేశారు.ఆతరువాత మొనాల్‌తో పులిహోర కలిపే కార్యక్రమంలో అభిజిత్ బాగా బిజీ అయ్యాడు.
ఇక సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన టైంలో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని నా ఫీలింగ్స్‌ని నువ్వు క్వచ్ఛన్ చేయడం నాకు నచ్చలేదు అంటూ ఏడ్చేయబోయింది మొనాల్.దీనికి నువ్వు నర్మద నదివి.. నీ కన్నీళ్లతో డ్యామ్ కట్టొచ్చు.. కళ్లల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నట్లు ఉంది అని అభిజిత్ పంచ్ వేశాడు.దీనికి నోరు మూసుకో అంటూ నవ్వేసింది మొనాల్.
ఈ వ్యవహారం చూసిన అఖిల్ తెగ ఫీల్ అయిపోయాడు.మొనాల్‌తో కొంతసేపు మాట్లాడటం మానేశాడు. దీంతో మొనాల్ అతని దగ్గరకు వచ్చి నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నిస్తూ ఏడుస్తూ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోయింది. ఆ తరువాత అఖిల్.. మొనాల్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు.
Advertisements
Advertisement
మధ్యలో లాస్య ఎంటరై.. అభిజిత్-మొనాల్ ఏం మాట్లాడుకున్నారో తెలియజేస్తూ అఖిల్ కి క్లాస్ పీకింది.నువ్వు ఇగ్నోర్ చేస్తే వెళ్తుందనడం కాదు.. ఆమెకు వెళ్లాలనుకుంటే వెళ్తుంది.. నీతో ఉంటే బాగుండు.. ఎవరో ఒకరైతే తగ్గాలి కదా? అంటూ లాస్య హితోపదేశం చేసింది.దానితో మోనాల్ తో అఖిల్ కూడా పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు.చివరిగా నాకు అభితో ఏం లేదు.. నీతోనూ ఏం లేదు.. కాని నీతో టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం. అది నువ్వు అర్థం చేసుకో.. అది నా ఫీలింగ్ అంటూ మొనాల్ అన్నది.
ఇక బిగ్ బాస్ ప్రతి సోమవారం ఇంటి సభ్యులకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని.. అందుకోసం రేషన్ మేనేజర్ ను నియమించడం జరుగుతుందని చదివి వినిపించిన లాస్యకే రేషన్ మేనేజర్‌ని ఎంపిక చేసే బాధ్యతను బిగ్ బాస్ అప్పగించారు.ఇక రేషన్ మేనేజర్ ఎన్నుకునే ప్రయత్నంలో దేవి,లాస్య కి వాగ్వాదం జరిగింది.కెప్టెన్ నిర్ణయమే ఫైనల్ కావడంతో.. అమ్మా రాజశేఖర్ రేషన్ మేనేజర్ అయ్యారు.
ఇక రెండో వారం ఎలిమినేషన్ ప్రకియం కోసం ఇంటి సభ్యులకు పడవ టాస్క్ ను బిగ్ బాస్ అప్పజెప్పాడు. ఈ టాస్క్ లో ఉన్న ఒక పడవలో ఇంటిలో ఉన్న 16 మందిలో 15 మంది ఎక్కి కూర్చోవాలని కోరారు.ఇక ఈ పడవ తొమ్మది తీరాలకు చేరుతుందని..తీరం చేరిన ప్రతిసారి పడవలో నుండి ఒకరు దిగాల్సి ఉంటుందని వారు ఎలిమినేషన్‌కి నామినేట్ అవుతారని బిగ్ బాస్ వివరించారు.
ఇక మొదట పడవ దిగడానికి ఒప్పుకొని గంగవ్వకు కాళ్లు పట్టేయడంతో పడవ దిగి నామినేషన్‌లోకి వచ్చింది.ఇక అనంతరం నోయల్,మోనాల్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు. తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కుమార్ సాయి మొదట అందరూ కోరుకుంటే దిగుతానని చెప్పారు.ఆతరువాత కుమార్ సాయి ఇంటి సభ్యులు అడిగినప్పుడు పడవ దిగడానికి ఇష్టపడలేదు.ఇక ఆతరువాత సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి దేత్తడి హారిక, అభిజిత్‌లు సెల్ఫ్ నామినేట్ అయ్యారు.
Advertisements
దీంతో రెండో వారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో గంగవ్వ, నోయల్, మొనాల్, సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌లు నామినేట్ అయ్యారు.ఇక మరిన్ని ఆసక్తికర అంశాల కోసం రేపటి ఎపిసోడ్ లో చూడాలి.