Advertisement
మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసనాథ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఏకశిల ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయాన్ని కేవలం ఒకే శిలను చెక్కి నిర్మించారు. దీంతో భారత్‌లోని అనేక గుహ ఆధారిత ఆలయాల్లో ఇది ముఖ్యమైందిగా పేరుగాంచింది. ఈ ఆలయం సైజులోనే కాదు, నిర్మాణశైలిలోనూ వైవిధ్యత మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఈ ఆలయాన్ని ఒకే శిలపై ముందుగా పై నుంచి కిందకు చెక్కుతూ వచ్చారు. తరువాత కింద భాగంలో చెక్కారు. అత్యంత నిపుణులైన శిల్పులు అయితేగానీ ఇలాంటి నిర్మాణాలు చెక్కడం వీలు కాదు. అందులోనూ అప్పట్లో ఇప్పుడు ఉన్న అధునాతన పనిముట్లు, యంత్రాలు ఏమీ లేవు. ఆ కాలంలోనే ఇలాంటి అద్భుతమైన నిర్మాణాన్ని, అది కూడా కేవలం ఒకే భారీ రాతిపై నిర్మించడం.. నిజంగా విశేషమే మరి.
ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు ఒక్కొక్కటి దేనికదే ప్రత్యేక నిర్మాణశైలిని, భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి. అప్పట్లో ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూశాడట. కానీ వీలు కాలేదు. అయితే ఆలయంలో ఉన్న ఏనుగుల శిలలకు మాత్రం స్వల్పంగా నష్టం వాటిల్లింది.
Advertisements
ఇక ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 150 ఏళ్లకు పైగానే పట్టినట్లు చరిత్ర చెబుతోంది. మొత్తం 7వేల మందికి పైగా కార్మికులు ఈ ఆలయ నిర్మాణ పనిలో నిమగ్నమయ్యారట. మొత్తం 2 లక్షల టన్నుల రాతిని అక్కడి నుంచి తొలగించి ఆలయాన్ని నిర్మించారట. అయితే అంతటి భారీ పరిమాణంలో రాళ్లను తొలగించాలంటే ప్రస్తుతం అత్యంత పెద్దవైన, 10 టన్నుల సామర్థ్యం కలిగిన 10 జేసీబీ యంత్రాలు అవసరం అవుతాయి. కానీ అవి కూడా 20వేల టన్నుల రాయిని మాత్రమే తొలగించగలవట. ఇక నిత్యం 1000 టన్నుల రాళ్లు వేసుకున్నా వాటిని తొలగించేందుకు ఇప్పుడైతే కనీసం 6 నెలల సమయం.. అంటే దాదాపుగా 200 రోజుల సమయం పడుతుందట. అలాంటిది అప్పట్లోనే 2 లక్షల టన్నుల రాళ్లను ఎలాంటి భారీ యంత్రాలు లేకుండానే తొలగించడం అంటే మాటలు కాదు.
ఎల్లోరా గుహల్లో కైలాసనాథ ఆలయం చాలా ముఖ్యమైంది. ఇక్కడ మొత్తం 34 గుహలు ఉండగా, 16వ గుహలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ గుహలు సహజసిద్ధంగా ఏర్పడినవి కావట. క్రీస్తు శకం 5 నుంచి 6వ శతాబ్దంలో కొండలను తొలచి ఈ గుహలను నిర్మించారట. ఇది కూడా సామాన్యమైన విషయం కాదు.
Advertisement
ఇక ఈ ఆలయంలో 3 అడుగుల కన్నా తక్కువ పొడవు, వెడల్పు కలిగిన, చిన్నవైన అనేక రంధ్రాలు, మనిషి దూరలేని రంధ్రాలు అనేకం ఉన్నాయి. వాటిని మనుషులు చెక్కడం అసాధ్యం. అందువల్ల అప్పట్లో నీటితోపాటు ఏవైనా రసాయనాలు కలిపి వాటిని నిర్మించి ఉంటారని ప్రస్తుతం సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే రసాయనాలు కలిపినా.. చెక్కిన నిర్మాణాల లాగా.. అంత కచ్చితత్వంతో.. ఆ రంధ్రాలను ఎలా నిర్మించి ఉంటారనేది.. ఇప్పటికీ అంతుబట్టని మిస్టరీగానే మిగిలిపోయింది. రసాయనాలను నీటితో కలిపి ఆ రంధ్రాల్లో ప్రవహింపజేస్తే అవి అంత పర్‌ఫెక్ట్‌గా ఏర్పడవు కదా.. వంకరటింకరగా ఉంటాయి. కానీ ఆ రంధ్రాలు చెక్కినట్లు చాలా కచ్చితత్వంతో ఉన్నాయి. అయితే వాటిని మనుషులు చెక్కలేరు. మరలాంటప్పుడు వాటిని ఎలా నిర్మించి ఉంటారనేది.. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియడం లేదు.
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం.. ఈ ఆలయం వెనుక భాగంలో 276 అడుగుల పొడవు, 154 వెడల్పు, 100 మీటర్ల ఎత్తులో ఓ మందిరం ఉంటుంది. 164 అడుగుల ఎత్తు, 109 అడుగుల వెడల్పు, 98 అడుగుల ఎత్తు ఉన్న అత్యంత భారీ అయిన ఏకరాతిపై ఈ ఆలయాన్ని నిర్మించారు.
మహారాష్ట్రలోని సంభాజీ నగర్ (ఔరంగాబాద్)కు ఈ ఆలయం 99 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 650 సంవత్సరాల మధ్య నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఈ ఆలయంలో మొత్తం 4 ఆలయాలు ఉండగా, మిగిలినవన్నీ నివాస ప్రాంతాలు.
ఇక అప్పట్లో విద్యుత్ ఉండేది కాదు కనుక.. కేవలం పగటిపూటే పనిచేసేవారు. ఈ క్రమంలో రోజుకు 16 గంటల పాటు ఆలయ నిర్మాణం కోసం పనిచేసేవారని తెలుస్తోంది. ఆలయంలో కనీసం సూర్య కిరణాలు కూడా పడని విధంగా అనేక నిర్మాణాలు ఉన్నాయి. సత్యయుగంలో మనుషుల సగటు ఎత్తు 32 అడుగులుగా ఉండేదని, మనుషుల ఆయుర్దాయం లక్షల సంవత్సరాల్లో ఉండేదని తెలుస్తోంది. ఇక యోగులు అప్పట్లో తాము కావాలనుకున్నప్పుడే చనిపోయే వెసులుబాటు ఉండేదట. ఈ క్రమంలో అప్పట్లో మనుషులు అంతటి భారీ దేహాలు, దేహదారుఢ్యం కలిగిన వారు కనుకనే వారు ఇంతటి భారీ శిలను చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని తెలుస్తోంది.
Advertisements