Advertisement
ఒకప్పుడు డ్రోన్లు కేవలం విలాసవంతమైన సదుపాయాలను అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ప్రస్తుతం వాటిని దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆర్మీ వారు శత్రుదేశాల కదలికలను తెలుసుకునేందుకు ఎక్కువగా డ్రోన్లపైనే ఆధారపడుతున్నారు. వాటి సహాయంతో శత్రువులు ఎక్కడ ఉన్నారు.. వారు దాడి చేస్తారా, లేదా.. వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి..? వారి వద్ద ఎలాంటి ఆయుధ సామగ్రి ఉంది ? వంటి వివరాలను తెలుసుకోగలుగుతున్నారు. అయితే అనేక దేశాలు భిన్న రకాల డ్రోన్లను ఆర్మీలో వాడుతున్నప్పటికీ ఒక్క డ్రోన్‌ను మాత్రం భారత్ సహా పలు అగ్ర దేశాలు కూడా వాడుతున్నాయి. అదే.. బ్లాక్ హార్నెట్ నానో..!
బ్లాక్ హార్నెట్ నానో అనేది చిన్నపాటి డ్రోన్. దీన్నే అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్ (యూఏవీ) అని కూడా అంటారు. దీన్ని నార్వేకు చెందిన ప్రాక్స్ డైనమిక్స్ ఏఎస్ తయారు చేసింది. అమెరికా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, నార్వే, నెదర్లాండ్స్, భారత్‌లు ఈ డ్రోన్‌ను ఆర్మీలో వాడుతున్నాయి. ఇది కేవలం ఒక చేతిలోనే ఇట్టే ఇమిడిపోతుంది. కేవలం అర ఔన్సు (16 గ్రాములు, బ్యాటరీలతో కలిపి) బరువు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఇది అద్భుతమైన ఫొటోలు, వీడియోలను తీయగలదు.
Advertisement
ఈ బుల్లి డ్రోన్ 10 × 2.5 cm కొలతలను కలిగి ఉంటుంది. తన చుట్టూ ఉన్న పరిసరాలను పూర్తిగా పరిశీలించి అద్భుతమైన క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలను తీయగలదు. చిన్నగా ఉంటుంది కనుక దీన్ని అంత సులభంగా గుర్తించలేరు. దూరం నుంచి చూస్తే పక్షి అనుకుంటారు. అందువల్ల ఈ డ్రోన్‌తో సులభంగా నిఘా పెట్టవచ్చు. ఈ డ్రోన్‌కు 3 కెమెరాలు ఉంటాయి. ఒక కెమెరా ముందుకు చూస్తుంది. మరొక కెమెరా కిందకు చూస్తుంది. ఇంకో కెమెరా 45 డిగ్రీల కోణంలో పక్కకు, కిందకు చూస్తుంది. అందువల్ల ఎప్పటికప్పుడు రియల్‌టైంలో స్పష్టమైన వీడియోలు, ఫోటోలను చిత్రీకరించవచ్చు.
ఈ డ్రోన్లను ఇప్పటి వరకు 3వేల వరకు తయారు చేశారు. ఒక్క ప్యాకేజీలో రెండు డ్రోన్లు ఉంటాయి. ఒక డ్రోన్ చార్జింగ్‌కు దాదాపుగా 25 నిమిషాల సమయం పడుతుంది. అంతే సమయం పాటు అది ఎగురుతుంది. ఆ సమయంలో ఇంకో డ్రోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ డ్రోన్ల తయారీకి గాను ఆ కంపెనీకి 20 మిలియన్ పౌండ్లు ఖర్చు అయింది. దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా సులభమే. కొద్దిగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు కేవలం 20 నిమిషాల్లోనే దీని పనితీరును పూర్తిగా అర్థం చేసుకుని ఆపరేట్ చేస్తారు. ఈ డ్రోన్ రేంజ్ 2 కిలోమీటర్లు కాగా గంటకు గరిష్టంగా 18 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఆరంభంలో వీటిని 160 వరకు మాత్రమే తయారు చేశారు. కానీ అక్టోబర్ 2014లో వీటిని 3వేలు తయారు చేసి ఆయా దేశాలకు విక్రయించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్‌డ్ కాంబాట్ డ్రోన్‌గా ఈ డ్రోన్ పేరుగాంచింది. దీన్ని భారత ఆర్మీలోనూ వినియోగిస్తున్నారు.
Advertisements
Watch Video:
Advertisements