Advertisement
కరోనా వైరస్ ఎంతో మందిని తమ కన్నవాళ్లకు, కుటుంబ సభ్యులకు దూరం చేసింది. చెప్పలేని గుండెకోతను మిగిల్చింది. ఇంకెంత మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంటుందో తెలియదు. కానీ ఈ వైరస్ వల్ల అనేక మంది చనిపోతుండడంతో వారి కుటుంబ సభ్యులకు తీరని వ్యథ మిగులుతోంది. కింద ఇచ్చిన ఫొటో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.
ఓ యువకుడు కోవిడ్‌తో బాధపడుతున్న తన బామ్మను తీసుకుని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు కారులో వచ్చాడు. అతను వైద్య సిబ్బందిని పిలుచుకువచ్చాడు. అయితే అప్పటికే ఆ వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. మరోవైపు శ్వాస తీసుకోవడం కష్టతరమైంది. దీంతో ఆమె మనవడు ఆమెకు తన నోటితో శ్వాస ఇచ్చేందుకు యత్నించాడు. అయితే ఆమెను పరీక్షించిన వైద్య సిబ్బంది ఆమె చనిపోయిందని నిర్దారించారు. సరిగ్గా అదే సమయంలో తీసింది ఈ ఫోటో. గుండెల్ని పిండేసే విధంగా ఉంది.
Advertisement
Advertisements
తమ ఆప్తులు తమకు దూరమైతే ఎవరికైనా ఇంతటి బాధే కలుగుతుంది. ఆ బాధ వర్ణనాతీతం. కోవిడ్ మహమ్మారి ఇంకా ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటుందో తెలియదు కానీ.. ఆ వైరస్ ఎంతో మందికి చెప్పలేని బాధను మిగులుస్తోంది. ఈ కష్టం ఇంకెన్నాళ్లు భరించాలో..!
Advertisements