Advertisement
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం ఇంటర్నెట్ లో ప్రచారం అవుతున్న ఫేక్ వార్తలకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. కొందరు పనిగట్టుకుని మరీ అస్తమానం ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారు. అయితే చాలా వరకు ఫేక్ వార్తలను జనాలు నమ్ముతున్నారు కానీ.. కొన్ని ఫేక్ వార్తలను మాత్రం ఇప్పటికీ అనేక మంది నిజమేనని అనుకుంటున్నారు. అలాంటి వాటిల్లో కింద తెలిపిన ఫేక్ వార్తలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. వీటిని ఇప్పటికీ నిజమేనని నమ్మేవారు కూడా ఉన్నారు. మరి వాటిపై ఓ లుక్కేద్దామా.!
ఇక ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీని పోలిన ముఖం పొందడం కోసం 19 ఏళ్ల సహర్ తబర్ అనే యువతి ఏకంగా 59 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుందని, దీంతో ఆమె ముఖం అంద విహీనంగా, రాక్షసిలా మారిందనే వార్త ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఏంజెలీనా జోలీలా కనిపించడం కోసం ఆమె తన ముఖానికి చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు విఫలమవడంతో అలా దారుణంగా మారిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన ఒ ఫోటోను కూడా వైరల్ చేశారు. అయితే అది ఫేక్ అని అప్పట్లోనే తేల్చినా.. దాన్ని ఇప్పటికీ నిజమేనని అనుకుంటున్నారు.
Advertisement
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని విలువ రూ.1.50 లక్షల వరకు ఉంటుందని కొందరు అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ వెడ్డింగ్ కార్డ్ ఫేక్ అని, అలాంటి కార్డ్‌ను తాము రిలీజ్ చేయలేదని, ఎవరికీ ఇవ్వలేదని రిలయన్స్ అప్పట్లో స్పష్టత ఇచ్చింది. కానీ దీన్ని ఇప్పటికీ నిజమని కొందరు ప్రచారం చేస్తున్నారు.
Advertisements
అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌ను ఆకట్టుకునేందుకు తన కారు మొత్తం రూ.2వేల నోట్లను అతికించాడనే వార్త వైరల్ అయింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజాలు కావని తరువాత తేలింది. కానీ ఆ ఫోటోలు ఇంకా నిజమేనని చాలా మంది నమ్ముతున్నారు. ఇలా పలు ఫేక్ వార్తలను జనాలు ఇప్పటికీ నిజమేనని నమ్ముతున్నారు. అవి ఫేక్ అని చెప్పినా ఎవరూ వినడం లేదు. అందుకనే ఫేక్ వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
Advertisements