Advertisement
తమిళనాడులోని పంబన్ దీవికి ఆగ్నేయ దిశగా ఉంది ఆ గ్రామం.. దాని పేరు.. ధనుష్కోడి.. 1964కు ముందు అది ఓ చిన్న టౌన్‌లా ఉండేది. కానీ ఆ ఏడాది అక్కడ వచ్చిన ఓ పెను తుఫాను కారణంగా ఆ ప్రాంతం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కేవలం కొన్ని నిర్మాణాల శిథిలాలు మాత్రమే మిగిలాయి. ఆ తుఫానులో అక్కడ నివాసం ఉంటున్న మొత్తం 1800 మంది చనిపోగా.. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ రైలు ప్రమాదానికి గురైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 115 మంది చనిపోయారు. దీంతో ఆ గ్రామం నివాసానికి పనికిరాదని ప్రభుత్వం నిర్దారించింది. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఎవరూ నివాసం ఉండడం లేదు. ఈ క్రమంలో ఆ గ్రామం దెయ్యాల గ్రామంగా మారింది. అందుకనే ఆ గ్రామం పేరు చెబితేనే అనేక మంది ఇప్పటికీ భయపడతారు.
ధనుష్కోడికి పురాణ నేపథ్యం కూడా ఉంది. శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు రామ సేతు వారధిని నిర్మించాలని చెప్పి ఈ ప్రాంతంలోనే కొంతకాలం ఉన్నాడట. శ్రీలంకు వెళ్లేందుకు భారత్‌కు చివరిగా ఉన్న సరిహద్దు ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ 1964కి ముందు వర్తకం బాగా జరిగేదట. అయితే ప్రస్తుతం ఈ గ్రామంలో మత్స్యకార కుటుంబాలు కొన్ని నివాసం ఉంటున్నాయి.
Advertisement
బీచ్‌లలో సేదదీరాలనుకునే బీచ్ లవర్లకు ధనుష్కోడి ఎంతో చక్కని అనుభవాన్ని ఇస్తుంది. దేశంలో ఉన్న అత్యంత శుభ్రమైన బీచ్‌లలో ధనుష్కోడి బీచ్ కూడా ఒకటి. దీన్నే తమిళనాడు వాసులు ఆరికల్ మునై అని పిలుస్తారు. బీచ్ ఒడ్డున కూర్చుని కొన్ని గంటల పాటు అలాగే బీచ్ అందాలను చూస్తూ గడపవచ్చు. అంతటి ప్రకృతి రమణీయతను ఈ బీచ్ కలిగి ఉంటుంది.
Advertisements
ఈ గ్రామంలో కోదండరామస్వామి ఆలయం ఉంది. దీనికి సుమారుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. తుఫాను వచ్చినప్పుడు కూడా తట్టుకుని నిలబడ్డ ఏకైక నిర్మాణం.. ఈ ఆలయమే. ఇక్కడే విభీషణుడు ఒకప్పుడు తన అన్న రావణున్ని ఓడించేందుకు శ్రీరాముడి సహాయం కోరాడు. శ్రీరాముడు ఇదే ప్రదేశంలో విభీషణున్ని లంకకు రాజుగా ప్రకటించాడట. ఈ ఆలయంలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడితోపాటు విభీషణుడి విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.
Advertisements