Advertisement
సాధారణంగా మన దేశంలో పోలీసులంటే భయం..పోలీస్ స్టేషన్ గడప తొక్కడం అంటే పరువు తక్కువ పని కింద జమ కడతారు.. చాలా తక్కువగా పోలీసులతో ఇంటరాక్ట్ అవ్వడానికి చూస్తారు..కానీ మన రోజువారి పనుల్లో ఎక్కువగా ట్రాఫిక్ పొరపాట్లు చేసి పోలీసుల చేతికి చిక్కుతుంటాం.. కాబట్టి మోటార్ వెహికిల్ యాక్ట్ కి సంబంధించిన చిన్నచిన్నవిషయాలు తెలుసుకుంటే ఇకపై అలాంటి తప్పులు చేయకుండా ఉంటాం.
- మోటార్ వెహికల్ చట్టం, 1988 సెక్షన్ 128ప్రకారం ఒక టూవీలర్ పైన కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. కారులో అయితే నలుగురికి మాత్రమే అవకాశం.
- సెక్షన్ 129 ప్రకారం బైక్ పై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది..కానీ మనలో చాలామంది బైక్ రైడ్ చేసే వాళ్లు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటారు..చాలా సంధర్బాల్లో వారు కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు..ఏటా సంభవించే రోడ్డు ప్రమాద మరణాల్లో హెల్మెట్ లేకుండా మరణించే వారి సంఖ్య లక్షన్నర పైనే..!
- ఈ పాయింట్ మీకందరికి సంతోషాన్ని కలిగిస్తుంది.. సాధారణంగా మనం రూల్ అతిక్రమించినా లేదంటే చలానా కట్టకపోతే ట్రాఫిక్ పోలీసులు మన కారు లేదా బైక్ కీ లాక్కుంటారు.. మనం బిక్కముఖాలు వేసుకుని నిల్చుంటాం.. కానీ అది చట్టవిరుద్దం. మనం సదరు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పూర్తి హక్కు ఉంటుంది.
- మీరు డ్రైవింగ్ చేసే సమయంలో మీ దగ్గర లైసెన్స్, RC, పొల్యుషన్ చెకింగ్ సర్టిఫికెట్(PUC) ఒరిజినల్ వి ఉండడం కంపల్సరి, జెరాక్స్ ,లేదంటే అటెస్టెడ్ కాపీస్ చూపిస్తే చెల్లదు…మొబైల్ లో అయినా ఫొటో తీసి పెట్టుకోవడం బెటర్..డిజిటల్ లాకర్లో సేవ్ చేసుకున్న కాపీస్ ని కూడా చూపించే వెసలుబాటు ఉంటుంది.
Advertisements
Advertisement
- ఒకవేళ మీ దగ్గర యట్ ద స్పాట్ లైసెన్స్ లేనట్టైతే..ఆ విషయాన్ని సదరు ఆఫీసర్ కి చెప్పగలగాలి..అప్పుడు లైసెన్స్ క్యారీ చేయలేదు అనే క్లాజ్ ప్రకారం మీకు ఫైన్ వేస్తారు..ఆ ఫైన్ ని మీరు ఐదు రోజులలోపు లైసెన్స్ చూపించి శిక్ష రద్దు చేయించుకోవచ్చు.. మీరు చెప్పలేకపోతే మీకు యదావిధిగా లైసెన్స్ లేకపోతే కట్టాల్సినంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది.!
- మోటారు వాహన చట్టం 1988, సెక్షన్ 185, 202 ప్రకారం మీరు మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ పట్టుబడినట్టైతే 100ఎంఎల్ రక్తంలో 30మిగ్రా కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఉంటే వారెంట్ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు..కాబట్టి ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేస్తే జాగ్రత్తా..!
- మైనర్లకు వెహికిల్ ఇచ్చినట్టైతే తండ్రికి లేదా గార్డియన్ కి జైలుశిక్ష మరియు ఫైన్ విధించే అవకాశం ఉంటుంది..
- రెడ్ సిగ్నల్ దాటితే ఫైన్,రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తే ఫైన్, మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఫైన్, మైనర్లకు వెహికిల్ ఇస్తే ఫైన్ మరియు జైలు శిక్ష.. లైసెన్స్ లేని వ్యక్తి వెహికిల్ డ్రైవ్ చేస్తే శిక్షా..ఇలా ప్రతిదానికి జరిమానా,శిక్ష అనేవి కేవలం దేశంలో పెరుగుతున్న ప్రమాదాలను తగ్గించడానికి మాత్రమే !
- జరిమానాలు,శిక్షలు కేవలం సామాన్యులకు మాత్రమే కాదు, రోడ్డు సరిగ్గా వేయలేదని కంప్లైంట్ ఇస్తే రోడ్ వేయించిన కాంట్రాక్టర్ కి, బైక్ ఆర్ కారుకి సంబంధించి ఫిట్నెస్ సరిగా లేకపోతే ఆయా సంస్థలకు కోట్లలో జరిమానాలు విధించబడతాయి..అలాంటి సమస్యలకు మనమెంత వరకు కంప్లైంట్ ఇస్తాం.. వాళ్లెంతవరకు కడతారనేది ప్రశ్న?
Advertisements