Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

మృగ‌శిర రోజున‌- ‘నాన్ వెజ్ వాళ్లు చేప‌ల‌’ను, ‘వెజ్ వాళ్లు ఇంగువ’ను ఎందుకు తింటారో తెలుసా?

Advertisement

రోహిణి కార్తెలో భగభగమండే ఎండల్ని దాటుకుని మృగశిర కార్తెలోకి అడుగుపెట్టాం.. తొలకరి జల్లులతో వర్షాకాలానికి ఆహ్వానం పలికేసాము..మృగశిర కార్తె ప్రారంభం  రోజున అనేకమంది చేపలు తింటుంటారు..వెజిటేరియన్స్ ఇంగువని, నాన్ వెజిటేరియన్స్ చేపల్ని తింటుంటారు..తెలంగాణాలో ఈ సంస్కృతి ఎక్కువగా ఉంటుంది..దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది..

వాతావరణం-ఆరోగ్యం-ఆహారం ఇవన్ని ఒకదానితో ఒకటి అవినాభవ సంబంధం కలిగి ఉంటాయి.. వాతావరణంలో మార్పు చోటు చేసుకోగానే ..మన ఆరోగ్యంలో కూడా తేడా చేస్తుంది..దాన్ని సరి చేసేది ఆహారం మాత్రమే..ఈ బంధమే మృగశిరకి, చేపకి మధ్య ఉన్నది కూడా..చేపలు తింటారు అనేది తెలిసిన విషయమే కానీ అన్ని చేపలు తినరు.. ప్రత్యేకంగా కొర్రమీను మాత్రమే తింటారు.

పాముని పోలి ఉండే కొర్రమీను చేప అనేక పోషకాలకు నిలయం.. ఈ చేపను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనేది తెలంగాణా వాసుల నమ్మకం..

Advertisement

  • కొర్రమీను చేపల ద్వారా బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. వీటిలో కేలరీలు, ప్రొటీన్లు, కొవ్వు, ఇనుము, కాల్షియం, ఫాస్సరస్‌, ఎ, బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కొవ్వుశాతం చాలా తక్కువ.
  • ఈ చేపల్లో ఎక్కువ స్థాయిలో “ఆల్బుమిన్‌” ఉంటుంది. అది శస్త్రచికిత్స చేయించుకున్నా, దెబ్బలు తగిలినా త్వరగా మానేలా చేస్తుంది. ఒకవేళ మన శరీరంలో ఆల్బుమిన్‌ లోపిస్తే  “హైపో ఆల్బుమిన్‌” అంటారు. అలాగైతే శరీరం పోషకాల్ని సరిగా గ్రహించక, ఎదుగుదల లోపించి మెదడు వృద్ధి చెందదు. రోగ నిరోధకశక్తీ తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి వృద్ది చెందాలంటే ఆల్బుమిన్ ఉండాలి..మందులతో ఆల్బుమిన్ సరిచేసుకునే కంటే ఆహారం ద్వారా భర్తీ చేయడం..తద్వారా ఇమ్యునిటి పవర్ పెంచుకోవడం ఉత్తమం.

మృగశిర రోజు కొర్రమీనుకి ఉన్న డిమాండ్ తో మార్కెట్లో లభించడం కష్టం .దాంతో చాలామంది  చేపలు తింటే చాలు అన్నట్టుగా మిగతావాటిని తింటుంటారు..లేదంటే నాన్ వెజ్ ని కూడా ప్రిఫర్ చేస్తుంటారు..

Advertisements

Advertisements

ఇంగువ కూడా మన శరీర వృద్దికి తోడ్పడుతుంది..ఇంగువ సహజమైన యాంటి బ్యాక్టిరియల్ గా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,రక్తపోటుని తగ్గిస్తుంది..మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది..ఇంగువని ఎక్కువ మోతాదులో తీసుకోకుడదు..దానివలన మన శరీరానికి మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు ఆరోగ్యం ముఖ్యమే కానీ..నిన్నటి చేపల మార్కెట్ పరిస్థితి చూస్తే చేపలు తినడం ద్వారా వచ్చే ఆరోగ్యం కన్నా…ఆ గుమికూడిన జనం వలన వచ్చే కరోనా ముప్పే అధికం అనిపిస్తోంది.. తస్మాత్ జాగ్రత్త..