Advertisement
మన దేశాన్ని అనేక ఏళ్ల పాటు మొగల్ చక్రవర్తులు పరిపాలించారన్న సంగతి తెలిసిందే. ఎంతో మంది మొగల్ చక్రవర్తులు దేశంలోని అనేక ప్రాంతాలను పాలించారు. అయితే అప్పట్లో మరాఠా రాజులకు, మొగల్ చక్రవర్తులకు మధ్య జరిగిన యుద్ధాల గురించి చరిత్రలో ప్రధానంగా చెప్పబడింది. ముఖ్యంగా మొగల్ చక్రవర్తులకు ఉన్న సైనిక బలం చాలా ఎక్కువ. మరాఠా రాజులకు సైనిక బలం లేదు.
మొగల్ చక్రవర్తులు అప్పట్లో సుమారుగా 5 లక్షల మంది సైన్యాన్ని కలిగి ఉండేవారు. వారు ఎప్పటికప్పుడు రాజ్యాల మధ్య కదులుతూ యుద్ధాలు చేసేవారు. ఔరంగజేబు భారీ ఎత్తున సైనికులతో మరాఠా రాజులపైకి దండెత్తి వచ్చేవాడు. అయితే అంత భారీ సైన్యం ఉన్నప్పటికీ మొగల్ చక్రవర్తులు మరాఠా రాజుల ఎదుట నిలబడలేకపోయేవారు.
Advertisement
మరాఠా రాజులపై మొగల్ చక్రవర్తులు ఓడిపోవడానికి కారణం.. వారు అనుసరించిన యుద్ధ వ్యూహాలే అని చెప్పవచ్చు. మొగల్ చక్రవర్తులు సుల్తాన్-ధావా పద్ధతిలో నేరుగా యుద్ధంలో పాల్గొంటే మరాఠా రాజులు మాత్రం గనిమి-కావా పేరిట గెరిల్లా యుద్ధాలు చేశారు. అందుకనే మరాఠా రాజులను మొగల్ చక్రవర్తులు ఢీకొట్టలేకపోయారు.
Advertisements
Advertisements
ఇక రామ్‌సెజ్ కోటను ఆక్రమించడానికి ఔరంగజేబుకు 6 ఏళ్లు పట్టింది. అంటే అప్పటి మరాఠా రాజులు ఎంతటి దృఢమైన వారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొగల్‌తో పోలిస్తే మరాఠా సైన్యం తక్కువే. అయినప్పటికీ మరాఠా సైనికులు మెరికల్లాంటి వారు. యుద్ధ నైపుణ్యాలు తెలిసిన వీరులు. అందువల్లే మొగల్ చక్రవర్తులకు అప్పట్లో వారు చుక్కలు చూపించారు. ఫలితంగా 50 ఏళ్ల వరకు భారత దేశంలో అనేక ప్రాంతాలను మరాఠా రాజులే పాలించారు. తరువాత మొగలుల ప్రస్థానం ప్రారంభమైంది.