Advertisement
అంబాని పరిచయం అక్కర్లేని పేరు.! ప్రపంచ టాప్ -10 ధనవంతుల్లో ఒకరు. ఆయన డబ్బు కంటే కూడా స్నేహానికి ఎక్కువ విలువిస్తారు. దానికి సంకేతం….ఆయన లెప్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఇద్దరూ కూడా ఆయన స్నేహితులే!
ఆనంద్ జైన్: ఈయన ముఖేష్ అంబానీ చిన్ననాటి స్నేహితుడు. 6వ తరగతినుండి క్లాస్ మేట్స్ ముఖేష్ అంబానీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. ధీరుభాయ్ దంపతులు ఇతనిని మూడవ కొడుకుగా చూసుకునేవారు. తన స్నేహితుడికి మొదట 15 కోట్ల జీతమిచ్చి తన కంపెనీలో ఉంచుకున్నాడు. తర్వాత కంన్స్టక్షన్స్ బిజినెస్ వైపు వెళ్లి ఇప్పుడు ఇండియా టాప్ -50 ధనవంతుల్లో ఒకడిగా ఉన్నాడు. ఇప్పటికీ అంబానీకి జైన్ ను తన కుడిభుజంగానే భావిస్తారు.
Advertisement
మనోజ్ మోడీ: ఎటువంటి పదవి లేదు., కానీ రిలయన్స్ మొత్తాన్ని నడిపిస్తాడు. ముఖేష్ కు ఎడమభుజం లాంటి వాడు. MM గా పేరు పడ్డ ఇతని మాటతీరు, సమస్యలను పరిష్కరించే పద్దతి అంటే అంబానీకి చాలా ఇష్టం. ఇతను అంబానీకి ఇంజనీరింగ్ ఫ్రెండ్ . . అప్పటి నుండి ఆ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది. ఈయన జీతం నెలకు 10 కోట్లు ( అంచనా) . ఈయనను అతి త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ కు MD ని చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
Advertisements
Advertisements