Advertisement
ముఖేష్ అంబానీ బిజినెస్ టైకూన్….పక్కా ప్లానింగ్, అంతకు మించిన ఎగ్జ్యూషన్…..అలా ఉండబట్టే నేడు రిలయన్స్ ను టాప్ ప్లేస్ లో నిలబెట్టాడు. అలాంటి వ్యక్తి …పెళ్లికి ముందు నీతాతో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ చిలిపి పనిచేశాడట! మనోడు చేసిన పనికి కొద్దిసేపు ఆ రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయ్యిందట!
అసలేమైంది…
నీతా డాన్స్ చూసి….ముఖేష్ అంబానీ తండ్రి అయిన ధీరూభాయ్ అంబానీ ఆ అమ్మాయినే తన ఇంటి కోడలిగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యి….తన ఇంటికి పిలిపించారట…మాట ముచ్చట అయ్యాయి…కానీ సంబంధం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఈ క్రమంలోనే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి నీతా- ముఖేష్ లు డేటింగ్ లో ఉన్నారట.!
Advertisement
Advertisements
ఒకరోజు ఇద్దరూ కార్ లో ప్రయాణిస్తున్న సమయంలో…..
ఒక్కసారిగా నీతాకు ప్రపోజ్ చేశాడట ముఖేష్…నీతా ఇంకా ఆన్సర్ ఇవ్వలేదట.! అప్పుడే గ్రీన్ సిగ్నల్ పడింది….అయినా కార్ ముందుకు నడపకుండా అక్కడే ఆపేశాడు…వెనుక నుండి హారన్స్…అయినా కార్ కదల్లేదు..నువ్వు ఏ సంగతీ చెప్పేవరకు కారు కదిల్చేది లేదు అని మొండిపట్టు పట్టాడట…నీతా యస్ చెప్పిందట…కార్ ముందుకు కదిలిందట.. మార్చి 8 ,1985 లో వాళ్ల పెళ్లైంది!
Advertisements