Advertisement
డెబ్బైఎనభైలో మల్టీస్టారర్ సినిమాలకు కొదవే లేదు.. రామారావు, నాగేశ్వర్రావు , కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు ఇలా ఆ తరం నటులందరూ లెక్కలేనన్ని మల్టీస్టారర్ మూవీస్ లో కలిసి నటించారు..తొంభైల్లో కూడా మల్టీస్టారర్ కి కొదవలేదు కాకపోతే పెద్ద హీరోలు చేసినవాటికంటే నాగార్జున,కృష్ణ, చిరు నాగేశ్వర్రావు ఈ కాంబినేషన్లో వచ్చేవి మూవీస్.. కాని తర్వాత వేళ్ల మీద లెక్కబెట్టగలిగే అన్ని సినిమాలు కూడాలేవు..మళ్లీ ఇప్పుడిప్పుడే మల్టీ స్టారర్ మూవిస్ వైపు మళ్లుతున్నారు మన హీరోలు.. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన, రాబోయే సినిమాలేంటో చూద్దాం..
ఎన్టీయార్ – రాంచరణ్:
ద మోస్ట్ ఇంట్రస్టింగ్ కాంబినేషన్.. ప్రజెంట్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా RRR.. మామూలుగా ఒక్క హీరో ఉంటేనే రాజమౌళి మేకింగ్ బీబత్సంగా ఉంటుంది… ఇక RRR ఎలా ఉండబోతుందో.. అందరి చూపు దీనిపైనే..ఎన్టీయార్, రాంచరణ్ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమాపై భారి అంచనాలున్నాయి.
మహేశ్ బాబు- వెంకటేష్:
Advertisements
సోలో అయినా, మల్టిస్టారరైనా ముందుండే నటుడు వెంకటేష్.. ప్రిన్స్ తో కలిసి నటించిన మూవి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ డూపర్ హిట్ అయింది..అన్నదమ్ములుగా వీరిద్దరి కాంబినేషన్ జనాలకు పిచ్చపిచ్చగా నచ్చింది…
వెంకటేష్ – పవన్ కళ్యాణ్:
గోపాల గోపాల సినిమాలో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు వెంకటేష్..ఆ సినిమాలో దేవున్ని నమ్మని భక్తుడిగా వెంకటేష్, దేవుడుగా పవన్ కళ్యాణ్ ఇద్దరి కాంబినేషన్ సూపర్..
వెంకటేష్ – నాగచైతన్య:
వెంకి మామా సినిమాలో మామా అల్లుల్లు స్క్రీన్ పంచుకుని ప్రేక్షకులకు కనువిందు చేశారు.. దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలి ఫ్యాన్స్ కి ఇద్దరికి గత సంక్రాంతి డబుల్ దమాకాగా నిలిచింది.
వెంకటేష్-వరుణ్ తేజ్:
ఎఫ్ 2లో వరుణ్ తేజ్ తో కలిసి వెంకి పండించిన కామెడీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. మామూలుగా వెంకీ కామెడీ పీక్స్ దానికి వరుణ్ తోడై థియేటర్ లో నవ్వులే నవ్వులు..
అల్లు అర్జున్ – మనోజ్:
వేదం సినిమాలో అల్లు అర్జున్ , మనోజ్ కలిసి నటించారు.ఇద్దరు కలిసి నటించారనే కాని ఇద్దరి ఒకేసారి స్క్రీన్ పై కనిపించే సన్నివేశాలు ఒకటి రెండు మినహా ఉండవు..అయినప్పటికి ఇద్దరి నటన ప్రేక్షకులకు ఫుల్ నచ్చింది.
Advertisement
ప్రభాస్ – రానా:
బాహుబలి సినిమాలో పోటాపోటిగా నటించారు ప్రభాస్ , రానా..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన తొలి మల్టీస్టారర్ మూవి ఇది…
నాగార్జున- నాని:
తన తర్వాత తరం నటులతో స్క్రీన్ పంచుకోవడానికి ముందుండే మరో నటుడు నాగార్జున.. నాని తో కలిసి నటించిన సినిమా దేవదాస్..ఈ ఇద్దరి కాంబినేషన్ ని జనాలు పిచ్చగా ఎంజాయ్ చేశారు.
నాగార్జున- కార్తి:
ఊపిరి సినిమాలో నాగార్జున తో స్క్రీన్ పంచుకున్నరు తమిళ నటుడు కార్తి.. పేరుకి తమిళ నటుడు అయినప్పటికి కార్తికి తెలుగులో అభిమానుల సంఖ్య ఎక్కువే.. ఈ సినిమాలో నాగార్జునతో సమానంగా కార్తి నటనకు మార్కులు పడ్డాయి..ఇద్దరి కాంబో జనాలకి నచ్చింది.
ఎన్టీయార్-మోహన్ లాల్:
మళయాల మెగాస్టార్ మోహన్ లాల్ తో ఒకప్పుడు బాబాయి స్క్రీన్ శేర్ చేసుకుంటే, ఇప్పుడు అబ్బాయి అదరగొట్టాడు..బాలకృష్ణ నటించిన గాంఢివం సినిమాలో ఒక పాటలో మెరిసారు లాల్.. జనతా గ్యారేజ్ లో ఎన్టీయార్ ,మోహన్ లాల్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ కి విజిల్సే విజిల్స్..
నాగార్జున-సుమంత్:
స్క్రీన్ పంచుకున్న మరో మామా అల్లుళ్లు నాగార్జున , సుమంత్.. వీరిద్దరూ స్నేహమంటే ఇదేరా సినిమాలో స్నేహితుల్లా నటించారు.. సినిమా హిట్ కాకపోయినా మామాఅల్లుల్లు కలిసి నటించడం తెలుగు ప్రేక్షకులను కనువిందు చేసింది..దివంగత నటి ప్రత్యూష ఈ సినిమాలో సుమంత్ కి జోడిగా నటించింది.
చైతన్య- సునీల్:
నాగచైతన్య, సునీల్ కలిసి నటించిన సినిమా తడాఖా..కమెడియన్ సునీల్ హీరోగా మారి తన జాతకం పరీక్షించుకున్నారు..ఒకట్రెండు సినిమాల్లో బాగానే నటించినప్పటికి తర్వాత క్యారెక్టర్,కామెడి ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి.. సునీల్ నటించిన మల్టీస్టారర్ మూవి తడాఖా..
ఇవే కాకుండా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఆచార్య మూవి మల్టీస్టారర్ దే అంటున్నారు..మహేశ్- బన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కలిసి నటించబోతున్నారనే వార్తలొస్తున్నాయి..మళయాలి హిట్ మూవి లూసిఫర్ తెలుగులో పట్టాలెక్కితే చిరుతో పాటు మరో యంగ్ హీరో నటించే అవకాశం ఉంది..ఇవన్ని కనుక వర్కవుట్ అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు పండగే..!
Advertisements