Advertisement
అందమైన ముగ్గురు రాజవంశ స్త్రీలు రాజసంగా కనిపిస్తున్న ఈ పెయింటింగ్ ను జాగ్రత్తగా పరిశీలిస్తే…కుడివైపున్న స్త్రీ తన చీరను కొంచెం పైకెత్తి తన చేతిని చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఫోటో తీస్తే అలా తీసారనుకోవొచ్చు…మరి పెయింటింగ్ లో కూడా ఇలా ఎందుకు వేయాల్సొచ్చింది.!? అంటే దీని వెనుక గొప్ప సందేశముంది.
19 వ శతాబ్దంలో… ఇండియాలో మశూచి మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న సమయం.! అలా మైసూర్ ప్రాంతంలో కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న సందర్భంలో …. మైసూర్ లో బ్రిటీష్ ఇండియా తరఫున పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మార్క్ విల్కేస్ మైసూర్ రాజ్యప్రజలను మశూచి నివారణకు టీకాలు వేసుకోవాల్సిందిగా కోరాడు.
Advertisement
కానీ బ్రిటీష్ టీకాలు ప్రాణానికే ముప్పు అనే వదంతులు అప్పటికే దేశమంతా చక్కర్లు కొట్టాయి..దీంతో చాలా మంది టీకాలు వేయించుకోడానికి తిరస్కరించారు. ఇదే సందర్భంలో మైసూర్ రాజ్య యువరాజుకు ఈ ఫోటోలో కుడివైపున్న దేవజమణితో నిశ్చితార్థం జరిగింది. ఆ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా….ఆ యువరాణి పెళ్లికి ముందే బ్రిటీష్ టీకాలను వేయించుకుంది. యువరాజుకు కాబోయే భార్యనే టీకా వేయించుకుంది. ప్రజలు కూడా స్వచ్చంధంగా ముందుకొచ్చి టీకాలు వేయించుకోవాలని …ఈ పెయింటింగ్ ద్వారా కోరారు.! అందుకే పెయింటింగ్ లో టీకా వేసిన చేయి అన్నట్టు సింబాలిక్ గా చూపించారు.
Advertisements