Advertisement
నాది ఒడిషా, తనది కర్నాటక! మాది లవ్ మ్యారేజ్… మా పెళ్లి రోజును తల్చుకుంటే మా ఆయన (రఘు) కష్టం గుర్తుకొస్తుంది. తన పెళ్లికి అన్నీ తానై చేసుకున్నాడు. మా వాళ్లకు మా విషయం చెబితే వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ఆర్థికంగా సహాయం చెయ్యలేదు. మా తరఫు బంధువులు కాస్ట్ పరంగా ఇది కరెక్ట్ కాదంటూ పెళ్లికెవ్వరూ రాలేదు.!
రఘు ….. మా తల్లిదండ్రులకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు., వారు ఒడిషా నుండి రాగానే వారిని పిక్ చేసుకొని ముందుగానే బుక్ చేసిన హోటల్ రూమ్ లో దించాడు. వారికి ఓ కార్ ను ఏర్పాటు చేసి… పెళ్లికి రెండు రోజుల టైమ్ ఉంది…ఊటీ, మైసూరు ట్రిప్ కు వెళ్లి రమ్మని చెప్పాడు… వాళ్లకు షాక్.! వచ్చింది కూతురు పెళ్లికా లేక ఫ్యామిలీ ట్రిప్ కా అర్థంకాక.!
Advertisement
ఇక రఘు వాళ్ల అమ్మ నాకు పట్టు చీర గిఫ్ట్ గా ఇచ్చి పెళ్లికి ఇదే కట్టుకోవాలంటూ పట్టు పట్టారు. పంతుల్ని మాట్లాడడం, భోజనాలు, క్యాటరింగ్ లు, పెళ్లికి వచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ లు…ఇలా ప్రతి ఒక్కటి రఘు యే చూసుకున్నాడు. చివరకు నా షాపింగ్ కూడా.! చిల్లి గవ్వ కట్నం కూడా తీసుకోలేదు .
సరిగ్గా పెళ్లి రోజు..ముహుర్త సమయాన మా పేరెంట్స్ వచ్చారు. నన్ను రఘుని ఆశ్వీరదించారు…..ఇలాంటి అల్లుడు దొరకడం అదృష్టమని చెప్పారు. ఎంతో సింపుల్ గా బంధుమిత్రుల మధ్య మా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత మా పేరెంట్స్ ను అంతే జాగ్రత్తగా ఇంటికి పంపించేశాడు.
Advertisements
మా పెళ్లికి గుర్తుగా…ఇప్పుడో బాబు.! రఘు మాత్రం అలాగే ఉన్నాడు… అంతే నిజాయితి, అదే కష్టపడే తత్వం, మితంగా మాట్లాడడం… థ్యాంక్స్ గాడ్ ఇంలాటి వాడిని భర్తగా ఇచ్చినందుకు.!
Advertisements