Advertisement
అక్కినేని వంశానికి మూడవతరం నట వారసులు నాగచైతన్య, అఖిల్….. ఇప్పటి వరకు వీరిద్దరూ హీరోలుగా సక్సెస్ అయినప్పటికీ స్టార్ హీరో ఇమేజ్ మాత్రం ఇద్దరికీ ఇంకా రాలేదు. అఖిల్ గురించి పక్కకు పెడితే నాగచైతన్యకు స్టార్ హీరో అనిపించుకునే సత్తా ఉన్నప్పటికీ అతను చేస్తున్న ఈ 6 తప్పుల కారణంగా ఆ స్థాయికి చేరుకోలేక పోతున్నాడు. మొదటి సినిమా జోష్ తో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నప్పటికీ ….. ఇండస్ట్రీ మాట్లాడుకునే రేంజ్ హిట్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు.
ఏంటా కారణాలు?
1. స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయకపోవడం.
హీరోని స్టార్ హీరోగా మార్చాలంటే కాస్త పేరున్న డైరెక్టర్లతో సినిమా చేయాలి. ఆడియన్స్ పల్స్ తెల్సిన దర్శకులతో ప్రాజెక్ట్ చేయాలి. కానీ చైతూ ఎక్కువగా కొత్త డైరెక్టర్లతోనే తన సినిమాలు చేశాడు. తన హిట్ సినిమా అయిన ఏమాయ చేసావే సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ స్టార్ డైరెక్టరే కానీ కమర్షల్ గా హీరోని నిలబెట్టే స్టార్ డైరెక్టర్ ఐతే కాదు.!
Advertisements
2. మాస్ మూవీస్ కొత్త డైరెక్టర్స్ తో చేయడం
ఒక హీరోని మాస్ హీరోగా నిలబెట్టాలి అంటే ఆ డైరెక్టర్ కి మాస్ పల్స్ బాగా తెలిసుండాలి . మాస్ డైరెక్టర్ గా తనకి పేరుండాలి . పూరి జగన్నాథ్ , రాజమౌళి , వి వి వినాయక్ , బోయపాటి లాంటి వారు అందులో ఎక్సపర్ట్స్ కానీ చైతన్య మాస్ సినిమాలన్నీ కొత్త డైరెక్టర్ల తోనో రెండో సినిమా డైరెక్టర్ల తోనో చేశాడు. దడ , బెజవాడ , ఆటో నగర్ సూర్య , సవ్యసాచి సినిమాలు కొన్ని ఉదాహరణలు . మాస్ సినిమా అని అభిమానులు హై ఎక్స్ పెక్టేషన్స్ తో రావడం డిస్సాపాయింట్ తో వెళ్లడం చైతన్య విషయంలో కామనైపోయింది .
3. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేయడం
Advertisement
చైతన్య హిట్ మూవీస్ చూస్తే అందులో హీరో కంటే హీరోయిన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది . దానివల్ల ఆటోమేటిక్ గా హీరోయిన్ పాత్రకే ఎక్కువ పేరొస్తుంది . ఏమాయ చేసావే , 100% లవ్ , మజిలీ సినిమాలు …..సూపర్ హిట్స్ అయిన వాటివల్ల లబ్ధిపొందింది హీరోయిన్స్ మాత్రమే!
4. మంచి ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేయడం
కింగ్ సినిమా తర్వాత శీను వైట్ల డైరెక్షన్ లో ఒక సినిమా అనుకున్నారు . అంతా అయిపోయాక చైతన్య ఆ మూవీ నుంచి తప్పకున్నాడు . బిజినెస్ మ్యాన్ టైమ్ లో పూరి జగన్నాథ్ ఒక స్టొరీ చెప్తే అది వొద్దన్నాడు . బోయపాటి శ్రీను తో ఒక స్టొరీ డిస్కషన్ స్టేజి లోనే వొదులుకున్నాడు . ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి తో దుర్గ , హలో బ్రదర్ మూవీస్ అనౌన్స్ చేసి తర్వాత వాటినుంచి తప్పుకున్నాడు . అదే దుర్గ టైటిల్ తో వి వి వినాయక్ అప్ప్రోచ్ ఐతే అదికూడా రిజెక్ట్ చేసాడు .
5. మోహమాటాల వల్ల సినిమాలు చేయడం
ఫ్రెండ్స్ అనో., రిలేటివ్స్ అనో మోహమాటానికి పోయి కొన్ని సినిమాలు చేశాడు . దడ , సాహసం శ్వాసగా సాగిపో , యుద్ధం శరణం గచ్చామి అలాంటి సినిమాలే.!
6. అభిమానులతో ఎక్కువగా టచ్ లో ఉండకపోవడం.
సినిమా రిలీజ్ అయితే హంగామా చేసి ఓపెనింగ్స్ తెప్పించేది ఫ్యాన్స్ , అందుకే అందరి హీరోలు ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తారు . అందుకే వారి సినిమాలు ప్లాఫ్ అయినా నెక్స్ట్ సినిమాకి అదే ఓపెనింగ్స్ ఉంటాయి. చైతన్య అభిమానులతో అంతగా టచ్ లో ఉన్నట్టు కనిపించదు.. ఆడియో ఫంక్షన్స్ లో కూడా చాలా కామ్ గా ఉంటూ కనిపిస్తాడు. అక్కినేని ఫ్యామిలీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చైతూ కు ఇంకా తెలియడం లేదు!
Advertisements
చైతూకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి., 100 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ఉంది. కానీ ఎందుకో అతడింకా స్టార్ హీరో స్థాయికి ఎదగలేదు. నాగచైతన్యను గట్టిగా నిలబెట్టే సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి!