Advertisement
నాగార్జున వెంకటేష్ …వీరిద్దరూ 1986లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నాగ్ విక్రం సినిమాతో , వెంకీ కలియుగపాండవులు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత నుండి వీరిద్దరి సినిమాలు దాదాపు ఒకే నెలలో విడుదలై పోటీపడ్డాయి. వరుసకు బావాబామర్దులు అవ్వడంతో వీరి మధ్య హెల్తీ కాంపిటేషన్ నడిచింది. వీరిని పోటీలో నిలబెట్టిన ఆ సినిమాలేంటి- వాటి రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం!
అగ్నిపుత్రుడు ( నాగ్ ) V/s విజేత విక్రమ్ (వెంకీ):
1987 ఆగస్ట్ నెలలో విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్లాప్ గానే మిగిలాయి.అగ్నిపుత్రుడు సినిమాను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తే… విజేత విక్రమ్ సినిమాను రవిచంద్ర డైరెక్ట్ చేశారు.
విజయ్ ( నాగ్ ) V/s ప్రేమ (వెంకీ):
Advertisements
1989 జనవరిలో విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.
గీతాంజలి ( నాగ్ ) V/s ఒంటిరి పోరాటం (వెంకీ):
1989 మే నెలలో విడుదలైన ఈ రెండు చిత్రాల్లో గీతాంజలి సూపర్ హిట్ అవ్వగా…. వెంకటేష్ ఒంటరి పోరాటం హిట్ గా నిలిచింది. గీతాంజలి సినిమాను మణిరత్నం డైరెక్ట్ చేయగా..ఒంటిరి పోరాటంను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.
ఇద్దరూ ఇద్దరే ( నాగ్ ) V/s బొబ్బిలిరాజా (వెంకీ):
1990 సెప్టెంబర్ లో రిలీజైన ఈ రెండు సినిమాల్లో… నాగ్ ఇద్దరూ ఇద్దరే ప్లాప్ అవ్వగా , బి గోపాల్ డైరెక్షన్ లో వెంకటేష్ నటించిన బొబ్బిలిరాజా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
శాంతి- క్రాంతి ( నాగ్ ) V/s సూర్య IPS (వెంకీ):
1991 సెప్టెంబర్ లో రిలీజైన ఈ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి.
Advertisement
కిల్లర్ ( నాగ్ ) V/s చంటి (వెంకీ):
1992 లో జనవరి10న ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి ఇండస్ట్రీ హిట్ కాగా … నాగార్జున కిల్లర్ హిట్ గా నిలిచింది.
అల్లరి అల్లుడు ( నాగ్ ) V/s అబ్బాయి గారు (వెంకీ):
1993లో నాగార్జున అల్లరి అల్లడు సూపర్ హిట్ కాగా వెంకటేష్ అబ్బాయి గారు ప్లాప్ గా మిగిలింది.
నిన్నే పెళ్లాడత ( నాగ్ ) V/s పవిత్ర బంధం (వెంకీ):
1996 ఆక్టోబర్ లో రిలీజైన ఈ రెండు సినిమాల్లో…. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన నిన్నే పెళ్లాడత సెన్సేషనల్ హిట్ కాగా … ముత్యాలసుబ్బయ్య డెరెక్ట్ చేసిన పవిత్రబంధం హిట్ అయ్యింది.
ఆజాద్ ( నాగ్ ) V/s జయం మనదేరా (వెంకీ):
2000 లో విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా హిట్ గా నిలిచాయి.
రగడ ( నాగ్ ) V/s నాగవల్లి (వెంకీ):
2010 డిసెంబర్ లో రిలీజైన రగడ యావరేజ్ కాగా, నాగవల్లి ప్లాప్ గా మిగిలింది.
గ్రీకు వీరుడు ( నాగ్ ) V/s షాడో (వెంకీ):
2013 లో విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్లాప్ గా నిలిచాయి.
Advertisements