Advertisement
బిగ్ బాస్ షోలో హోస్ట్ గా బిజిబిజీగా ఉన్న నాగ్…. సడెన్ గా లాస్ట్ వీక్ తన హోస్టింగ్ బాధ్యతలను కోడలు సమంతకు అప్పజెప్పి … తన నెక్ట్స్ మూవీ వైల్డ్ డాగ్ షూటింగ్ లో పాల్గొనడానికి కులుమనాలి వెళ్లారు.! నాగ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.!
ఇంతకీ ఏంటీ సినిమా?
అహిహోర్ సొలోమాన్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నాగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్ .! ఈ సినిమాలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగార్జున నటిస్తున్నట్టు సమాచారం! యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.
Advertisement
Advertisements
ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడంతో డిపార్టమెంట్ విజయ్ వర్మని రంగంలోకి దింపుతుంది. స్పెషల్ టీంతో అపరేషన్ మొదలుపెట్టిన విజయ్ వర్మ కరుడుగట్టిన ఆరుగురు తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేస్తాడు. ఇదే తరహాలో ఎన్నో ఎన్కౌంటర్లు చేసి డిపార్ట్మెంట్ లో సంచలనం సృష్టిస్తాడు… విజయ్ వర్మ ఆ ఆపరేషన్ లో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది… ఈ మిషన్ వెనుకున్నది ఎవరు అనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది!
Advertisements
ఎన్కౌంటర్ సన్నివేశాల్లో నటించేందుకే నాగ్ కులు మనాలికి వెళ్లాల్సి వచ్చింది. మూడు రోజుల షూట్ తర్వాత డైరెక్ట్ గా ప్రత్యేక హెలికాఫ్టర్ లో హైద్రాబాద్ కు చేరుకున్నారు నాగ్..వచ్చిన వెంటనే బిగ్ బాస్ హౌస్ హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు.