Advertisement
నలుగురు సన్యాసులు … వారం పాటు మౌనవ్రతం చేయాలని ఒక నియమాన్ని పెట్టుకున్నారు. ఓ రాత్రి దీపం వెలిగించి తమ నడక ప్రారంభించారు. గాలికి దీపం ఆరిపోయింది. వెంటనే మొదటి సన్యాసి….”ఓహ్ దీపం ఆరిపోయింద”ని చెప్పాడు…దీంతో అతడు నియమాన్ని తప్పాడు, రెండో వాడు “మేము మాట్లాడకూడదు” అంటూ అతడూ నియమాన్ని తప్పాడు…”మీరిద్దరూ నియమాన్ని తప్పారు” అంటూ మూడవ సన్యాసి మాట్లాడి తనూ నియమం తప్పాడు…ఇక నాల్గవ వాడు..”మీరు ముగ్గురూ ఓడిపోయారం”టూ నోరు తెరిచి అతడూ నియమం తప్పాడు.
Advertisement
- దీపం ఆరిపోగానే మొదటి వాడు… దానికి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించొచ్చు కానీ అలా చేయలేదు.
- రెండో వాడైన ఆ తప్పును సింపుల్ గా సరిదిద్దొచ్చు కానీ అలా చెయ్యలేదు.
- మూడో వాడైన తన కోపాన్ని ప్రదర్శించకుండా శాంతంతోనే ఆ తప్పును రెక్టిఫై చేయోచ్చు కానీ చెయ్యలేదు.
- నాల్గో వాడు మిగితా వారు ఓడారు..తానే గెలిచానన్న ఆనందాన్ని అహాన్ని బయటపెట్టాడు కానీ తప్పును సరిదిద్దలేదు.
సమాజమే ఇలా ఉంటుంది…. మన తప్పును ఎత్తిచూపుతూ వాళ్లు తప్పులు చేస్తారే తప్ప..సరిదిద్దే ప్రయత్నం చేయరు. ఇక ప్రతిదీ బయటికి చెప్పుకొని మనల్ని మనం చులకన చేసుకునే కంటే…మన తప్పల్ని మనమే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మాట కంటే కూడా పనికి ప్రాముఖ్యత ఇవ్వాలి.
Advertisements